భారత ఆర్మీలో ‘స్వలింగ సంపర్కులకు’ నో ఎంట్రీ... - జనరల్ బిపిన్ రావత్

సైన్యంలో వివాహేతర సంబంధాలకు, స్వలింగ సంపర్కులకూ అనుమతి లేదు... సుప్రీం తీర్పులతో సైన్యానికి సంబంధం లేదు... మీడియా సమావేశంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 5:45 PM IST
భారత ఆర్మీలో ‘స్వలింగ సంపర్కులకు’  నో ఎంట్రీ... - జనరల్ బిపిన్ రావత్
భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ (PTI Photo)
  • Share this:
భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత సైన్యంలో స్వలింగ సంపర్కులకు ప్రవేశం లేదు...’ అని తేల్చి చెప్పేశారు. వివాహేతర సంబంధాలు కొనసాగించే వారికి కూడా ఇక్కడ చోటు ఉండదని స్పష్టం చేశాడు. స్వలింగ సంపర్కాన్ని చట్టం బద్ధం చేస్తూ, గత ఏడాది సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సవరణ ప్రకారం గే, లెస్బియన్, అసహజ శృంగారం జరపడాన్ని నేరంగా పరిగణించరు. అయితే భారత సైన్యం విషయంలో మాత్రం ఈ సవరణ చెల్లదంటూ సంచలన ప్రకటన చేశారు ఆర్మీ జనరల్. అలాగే ఇష్టపూర్వకంగా జరిపే వివాహేతర సంబంధం కూడా నేరం కాదని సెక్షన్ 497ను సవరణ చేసిన విషయమూ తెలిసిందే. ఈ సవరణ కూడా భారత సైన్యం విషయంలో చెల్లుబాటు కాదని తేల్చేశారు ఆర్మీ చీఫ్. వివాహేతర సంబంధం కొనసాగించే ఆర్మీ అధికారులపై, సైనికులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

భారత సైన్యం చట్టాలకు అతీతం కాదు... భారత రాజ్యాంగం సైనికులకు కొంత స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇచ్చింది. దీని ప్రకారం సైన్యంలోని స్వలింగ సంపర్కులను, వ్యభిచారులను అనుమతించేది లేదు. ఎల్జీబీటీ కమ్యూనిటీ వర్గాలు భారత సైన్యానికి పనికి రారు...
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్


స్వలింగ సంపర్కులను, వివాహేతర సంబంధాన్ని భారత ఆర్మీలో కూడా చట్టబద్దం చేస్తే విపరీత చర్యలు ఉంటాయని, సైన్యంలోనూ ఇలాంటి విపరీత చర్యలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇండియన్ మిలిటరీలో ఉన్న చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం కఠినంగా శిక్షించదగిన నేరం. సైనికులు, వారి కుటుంబాలు కచ్ఛితంగా నైతిక విలువలు పాటించాలని, వాటిని తప్పినవారు క్షమింపబడని శిక్షార్హులను భారత సైన్య చట్టం సెక్షన్ 56 పేర్కొంటోంది. దాన్ని మార్చాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు పేర్కొనలేదని ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు.
First published: January 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>