• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • INDIA GOVERNMENT MINT EMPLOYEE FACES UP TO 7 YEARS IN JAIL FOR RS 40 THEFT BN

రూ.40 దొంగతనం చేశాడని.. ప్రభుత్వ ఉద్యోగికి ఏడేళ్ల జైలు శిక్ష..?

ప్రతీకాత్మక చిత్రం

అందులో వారికి రెండు రూ.20 నాణెలను గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు ప్రకారం చాబుక్స్వర్‌కు ఏడు సంవత్సరాల శిక్ష పడనున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.

  • Share this:
    అది ముంబైలోని భారత ప్రభుత్వ మింట్ విభాగం. అక్కడ చాబుక్స్వర్ అనే ఉద్యోగి పనిచేస్తున్నాడు. మంచి వేతనం.. సెక్యూర్డ్ జీవితం. కానీ ఆ ఉద్యోగి చాబుక్స్వర్‌కు అవి తృప్తిని ఇవ్వలేదు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశో.. మరే కారణమో తెలియదు కానీ అతడి మదిలో ఓ చెడు ఆలోచన మెదిలింది. అదేంటంటే అక్కడున్న ఉన్న రెండు కొత్త రూ.20 నాణెలను దొంగిలించడం. అనుకున్నదే తడవుగా ఇంకా మనుగడ(చెల్లింపులోకి)లోకి రాని రెండు రూ.20 నాణెలను దొంగిలించి తన లాకర్‌లో దాచుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న సెంట్రల్ ఇండ్రస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) అక్కడి అధికారుల సమక్షంలో చాబుక్స్వర్ లాకరును తెరిచారు. అందులో వారికి రెండు రూ.20 నాణెలను గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు ప్రకారం చాబుక్స్వర్‌కు ఏడు సంవత్సరాల శిక్ష పడనున్నట్టు అక్కడి అదికారులు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పోలీసులు చాబుక్స్వర్‌ను ఇంకా అరెస్టు చేయలేదు.

    అయితే మింట్‌ లోపలికి ప్రవేశించే, బయటకు వెళ్లే సమయంలో అక్కడి సీఐఎస్ఎఫ్ అధికారులు తప్పనిసరిగా ప్రతి ఉద్యోగిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎవరూ కూడా నాణెలను బయటకు తీసుకెళ్లడం సాధ్యం కాని పని. అయినా చాబుక్స్వర్ రూ.20 నాణెలను ఎందుకు దాచుకున్నాడనేది తెలియని విషయం. ఈ విషయమై.. ఇప్పటికే ఉద్యోగి చాబుక్స్వర్‌కు దర్యాప్తునకు సహకరించాలంటూ పోలీసులు నోటిసులు పంపించారు. ఇదిలావుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో కొత్త నాణెలను ఆవిష్కరించారు. ఇందులో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణెలు ఉన్నాయి. అయితే ఇందులో రూ.20 నాణెం మినహా మిగతావన్నీ చెలామణిలో ఉన్నాయి. రూ.20 నాణెం వాస్తవానికి ఏప్రిల్‌లో చెలామణిలోకి రావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో రూ.20 నాణెం చెలామణిలోకి రాలేదు.
    Published by:Narsimha Badhini
    First published: