హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: న్యాయం కోసం భర్త ఇంటి ముందు భార్య ధర్నా.. కారణం ఏంటంటే..?

Andhra Pradesh: న్యాయం కోసం భర్త ఇంటి ముందు భార్య ధర్నా.. కారణం ఏంటంటే..?

న్యాయం కోసం భర్త ఇంటి ముందు భార్య ధర్నా

న్యాయం కోసం భర్త ఇంటి ముందు భార్య ధర్నా

భర్తతో కాపురం చేయడానికి భార్య పోరాడాల్సి వస్తోంది. చిన్నారి కూతురిని ఒళ్లో పెట్టుకోని ఆమె అత్తారి ఇంటి ముందు బైఠాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆమెను ఎందుకు ఇంట్లోకి రానివ్వడం లేదో తెలుసా..?

  P.ఆనంద్ మోహన్, విశాఖపట్నం ప్రతినిధి, న్యూస్18              మహిళలకు రక్షణగా ఎన్ని చట్టాలు ఉన్నా.. గృహ హింస కేసులు పెడుతున్నా.. కొందరికి వేధింపులు తప్పడం లేదు. అది కూడా ఉన్నత కుటుంబాలకు చెందిన వారే ఇలా చేయడంతో మహిళలకు రక్షణ కరువు అవుతోంది. సొసైటీలో ఉన్న పలుకుబడి.. పోలీసులు, ఇతర అధికారులతో ఉన్న పరిచాయలతో వారిపై కేసులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి ఇంటికి కోడలిగా వచ్చిన వారికి కష్టాలు తప్పడం లేదు. తరచూ ఇలాంటి వార్తలు తెరపైకి వస్తున్నా.. వీటికి అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విశాఖపట్నంలోని ఓ వివాహిత మహిళ.. కూతురితో కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టాల్సి వచ్చింది. విషయం తెలియడంతో ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. ఆమెను వేధింపులకు గురి చేస్తున్నా అత్తింటి వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మహిళ మాత్రం తనకు న్యాయం చేయాలని.. భర్తతో కలిసి ఉండేలా చేయాలని కోరుకుటుంటోంది. తననున అత్త, తోటి కోడలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు అత్తవారింటి ముందు నుంచి కదిలేది లేదని ఆమె చెబుతోంది..

  బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం. తాను కాపురానికని వస్తే అత్త తోటి కోడలు రానివ్వడం లేదని.. ఇంటి గేటు వేసేస్తున్నారని ఆరోపిస్తోంది. అదనపు కట్నం తీసుకొస్తేనే లోపలికి అనుమతిస్తామని చెబుతున్నారని కన్నీరు పెడుతోంది. ముఖ్యంగా తనకు ఆడ పిల్ల పుట్టడంతో ఈ వేధింపులు రెట్టింపు అయ్యాయని.. తన భర్తను కూడా కలుసుకోకుండా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది..

  విశాఖజిల్లా నర్పీపట్నం నియోజకవర్గం పెద్దబొడ్డేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య డిజిటల్స్ అధినేతకు చెందిన ఇంటి వారు తనను వేదిస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. పెళ్లైన తరువాత తన

  భర్తకు సచియాలయంలో ఉద్యోగం రావడం, ఆడపిల్ల పుట్టడంతో ఆదనపు కట్నం కోసం మరింత వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.


  పెళ్ళైన 5 నెలల వరకు తనను బాగానే చూసుకున్నారని.. అయితే ఆ తరువాత తన భర్తకు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చిందని అప్పటి నుంచి ఆదనపుకట్నం తేవాలంటూ వేధించడం ప్రారంభించారని ఆమె ఆరోపిస్తోంది. దానికి తోడు ఆడపిల్ల పుట్టడంతో మరింత వేధింపులు పెరిగాయని మీడియాతో చెబుతోంది. అదనపు కట్నం తీసుకోస్తేనే ఇంట్లోకి రానిస్తామని చెబుతున్నారని.. లేదంటే తన భర్తకు మరో మహిళతో వివాహం చేస్తారని బెదిరిస్తున్నారని.. ఈ విషయం తెలియడంతో తన తల్లి గుండెపోటుతో మరణించిందని.. అందుకే ఇలా ఇంటి గేటు ముందు బైఠాయించాల్సి వచ్చింది అంటోంది బాధితురాలు పార్వతి. దీనిపై గతంలో మా అమ్మగారి ఊరు అయిన రావికమతం పోలీస్ ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. అందుకే ఇప్పుడు న్యాయం కోసం ఇక్కడి వచ్చాను అంటోంది పార్వతి..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Visakhapatnam, Vizag, Wife

  ఉత్తమ కథలు