IN VISAKHAPTNAM THE SON WHOSE FATHER WAS KILLED BY ALCOHOL INTOXICATION VZM NGS
Visakhapatnam: విశాఖలో దారుణం: తండ్రిని చంపిన కసాయి కొడుకు: కారణమేంటో తెలుసా?
కన్న తండ్రిని చంపిన కసాయి కొడుకు
మద్యం మత్తులో కొందరు రక్త సంబంధాన్ని మరిచిపోతున్నారు. ఏం చేస్తున్నారో తెలియని మైకంలో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఓ కసాయి కొడుకు క్షణికావేశంలో కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు? ఎందుకో తెలుసా?
ఒకప్పుడు ప్రశాంత నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం.. ఇప్పుడు క్రైమ్ కు కేరాఫ్ అవుతోంది. రోజు రోజుకూ క్రైమ్ రేట్ పెరుగుతూ వస్తోంది. రౌడీ షీటర్లు, మద్యానికి బానిసైన వాళ్లు, సైబర్ నేరగళ్లతో విశాఖలో ఇప్పుడు ప్రశాంతంత కొరవడుతోంది. రోజు రోజూ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొందరైతే చిన్న చిన్న కారణాలకు కూడా హత్యలు చేసే దాకా వెళ్తున్నారు. క్షణికావేశానికి లోనై రాక్షసులు అవుతున్నారు. కొందరి ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు రక్తసంబంధం.. సన్నిహితులు అన్న సంగతి మరచిపోయి రక్తం చిందిస్తున్నారు.
తాజాగా విశాఖపట్నంలోని బుచ్చయ్యపేట మండలంలో దారుణం జరిగింది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే తండ్రి ప్రాణాలను క్షణికావేశంలో బలి తీసుకున్నాడు. విజయరామరాజు పేట గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులోఉన్న శివ మణి.. ఏం చేస్తున్నాడో కూడా తెలియని మైకంలో తండ్రిని అతి కిరాతకంగా కొట్టి చంపాడు. . భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడమే ఆ తండ్రి చేసిన పాపమై.. అతడి ప్రాణాలు పోయేలా చేసింది.
నిత్యం మద్యానికి బానిస అయిన శివ మణి ప్రతి నిత్యం భార్యతోనూ, తండ్రితో గొడవపడేవాడు. ఎన్నిసార్లు వారు వారించినా పంతా మార్చుకోలేదు. అయితే ఎప్పటిలాగే పీకల లోతు వరకు తాగి వచ్చిన శివ మణిని.. అతడి భార్య మందలించే ప్రయత్నం చేసింది. మద్యం తాగి ఎందుకు వచ్చావని ప్రశ్నించడంతో శివాలెత్తిపోయిన శివమణి.. వెంటనే ఇంట్లో దొరికిన ఇనుప రాడ్డుతో భార్యను చితకబాదడం మొదలెట్టాడు. అది చూసిన తండ్రి సోమునాయుడు.. కొడుకును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. కొట్టద్దు కోడలు చనిపోతుందని చెప్పే ప్రయత్నం చేసినా.. మద్యం మత్తులో ఉన్న అతడి చెవికి ఎక్కలేదు. దీంతో అదే రాడ్ తో కన్న తండ్రి తలపై గట్టిగా మోదాడు. బలంగా ఇనుప రాడ్డుతో కొట్టడంతో సోమునాయుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇంట్లోంచి భారీ కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి.. శివమణి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన తరలి వచ్చిన పోలీసులు, గాయపడ్డ కోడలిని, మామను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సోమునాయుడు మరణించాడు. కోడలుకి స్వల్ప గాయాలు అయ్యాయి.
కన్న తండ్రిని అతి కిరాతకంగా చంపిన శివమణిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన కసాయి కొడుకు కోసం గాలిస్తున్నారు. కేవలం మద్యం మత్తులోనే శివమణి హత్య చేశాడు. ఈ హత్యకు వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.