హోమ్ /వార్తలు /క్రైమ్ /

కాలేజీ విద్యార్థిని పై అఘాయిత్యం.. ఆటో దిగుతుండగా ప్రైవేటు పార్ట్ లను తాకి.. ఆ తర్వాత..

కాలేజీ విద్యార్థిని పై అఘాయిత్యం.. ఆటో దిగుతుండగా ప్రైవేటు పార్ట్ లను తాకి.. ఆ తర్వాత..

బాధితురాలు ప్రయాణించిన ఆటో

బాధితురాలు ప్రయాణించిన ఆటో

Tamil nadu:  కాలేజీ విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి హోటల్ వెళ్లింది. రాత్రి కావడంతో వారు ఇంటికి తిరిగి వెళ్లడానికి ఉబర్ ఆటోను బుక్ చేసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

తమిళనాడులో (Tamil nadu) దారుణ ఘటన జరిగింది. చెన్నైలో తన స్నేహితురాలితో కలిసి హోటల్ కు వెళ్లిన యువతి తిరిగి రావడానికి ఉబర్ ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఈ క్రమంలో ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటనను విద్యార్థిని ట్విటర్ లో పోస్ట్ చేసి తన బాధను చెప్పుకుంది. దీంతో నెటిజన్లు ఘటనపై తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

పోలీసుల ప్రకారం.. చెన్నైలో (Chennai)  ఇషితా సింగ్ అనే డిగ్రీ యువతి స్థానికంగా ఉన్నసిటీ హోటల్ కు వెళ్లింది. తిరిగి ఇంటికి రావడానికి ఉబర్ లో ఆటోను బుక్ చేసుకుంది. అప్పటికే రాత్రి 10 అయ్యింది. ఆమె స్నేహితురాలు ఆటో దిగుతుండగా ఆటో డ్రైవర్ , బాలిక రొమ్మును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే గట్టిగా అరవడంతో అతను పారిపోయాడు. వెంటనే యువతి.. స్థానికంగా ఉన్న లేడీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ మహిళా పోలీసులు ఎవరు లేరు.

దీంతో ఎఫైఐఆర్ నమోదు చేయలేదు. అక్కడ రాత్రిపూట అని.. స్టేషన్ లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని యువతి వాపోయింది. ఈ క్రమంలో ఆటోరిక్షా ఫోటోలను ట్విటర్ లో పోస్టు చేసింది. సెల్వం అనే ఉబర్ డ్రైవర్ తన కుడి రొమ్మును నొక్కి అసహ్యంగా ప్రవర్తించాడని తన బాధను ట్విటర్ లో పోస్ట్ చేసింది.  ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. యువతి పోలీసు కమిషనర్ కు ట్యాగ్ చేసింది. వెంటనే అధికారులు దీనిపై రిప్లై ఇచ్చారు. కేసు నమోదు చేశామని, వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Tamil nadu

ఉత్తమ కథలు