Daughter: ఏం కూతురివమ్మా నువ్వు.. రాత్రి నిద్రపోతున్న కన్నతల్లిని నిద్రలేపి ఇలా చేయడానికి చేతులెలా వచ్చాయో..

నిందితురాలు

హుస్సేన్‌నగర్‌లో బచ్నూ, అతని భార్య పప్పి నివాసముంటున్నారు. వీరికి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. ఆమె పొరుగున ఉండే ఆయుబ్ అలియాస్ సల్మాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్ని నెలలుగా పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది.

  • Share this:
    ఉన్నావ్: సమాజంలో రోజురోజుకూ బంధాలకు, అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. వ్యామోహాల మోజులో పడి కడుపున పుట్టిన కన్న బిడ్డలను హతమార్చుతున్న వారే కాదు.. కన్న తల్లిదండ్రులను చంపుకుంటున్న వారూ మనం బతుకుతున్న ఇదే సమాజంలో ఉన్నారంటే నమ్మగలమా. కానీ నమ్మక తప్పదు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడితో ప్రేమను తల్లి వద్దనడంతో కన్నతల్లినే ప్రియుడితో కలిసి కూతురు హతమార్చింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన తల్లిని హత్య చేసినట్లు నాటకం ఆడింది. పోలీసులు హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించి కన్న కూతురు, ఆమె ప్రియుడే నిందితులని తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేన్‌నగర్‌లో బచ్నూ, అతని భార్య పప్పి నివాసముంటున్నారు. వీరికి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. ఆమె పొరుగున ఉండే ఆయుబ్ అలియాస్ సల్మాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్ని నెలలుగా పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో.. యువతి తల్లి పప్పి కూతురిని మందలించింది.

    అయినప్పటికీ తల్లికి తెలియకుండా ఆ యువతి సల్మాన్‌తో ప్రేమాయణం సాగించింది. ఈ విషయం తల్లికి తెలిసి మరోసారి గట్టిగా మందలించడంతో కన్నతల్లిపైనే కూతురు పగ పెంచుకుంది. తన ప్రియుడితో కలిసి ఉండాలంటే తల్లిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. అయితే.. హత్య కేసులో ఇరుక్కోకుండా ఆమె, ఆమె ప్రియుడు బయటపడాలని ప్లాన్ చేసింది. తండ్రి ఇంట్లో లేని సమయం కోసం వేచి చూసింది. ఆమె తండ్రి బుధవారం రాత్రి వ్యవసాయ పని మీద పొలం దున్నేందుకు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లాడు. వచ్చేసరికి ఆలస్యమవుతుందని.. తిని పడుకోవాలని భార్య, కూతురికి చెప్పి వెళ్లాడు. ఇదే సరైన అవకాశమని భావించిన యువతి తన తండ్రి వెళ్లిపోయాక.. తన తల్లి నిద్రించాక ప్రియుడికి ఫోన్ చేసి రావాలని చెప్పింది.

    ఇంటి మెట్ల దగ్గర ఆమె ప్రియుడు ఇటుక రాయితో నక్కి ఉన్నాడు. తన తల్లిని అక్కడికి తీసుకెళ్లేందుకు కూతురు నాటకమాడింది. రాత్రి సమయంలో తల్లిని నిద్ర లేపి ఎవరో పిలిచారంటూ ఆమెను మెట్ల వరకూ తీసుకెళ్లింది. అప్పటికే మెట్ల పక్కన నక్కి ఉన్న యువతి ప్రియుడు చేతిలో ఉన్న ఇటుక రాయితో యువతి తల్లి తల పగలగొట్టి అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్ర రక్రస్రావం కావడంతో యువతి తల్లి కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత యువతి పెద్దగా కేకలేస్తూ నాటకానికి తెరలేపింది. ఆమె కేకలు విని ఇరుగుపొరుగు వారు రావడంతో.. ఏం జరిగిందని అడగ్గా.. తాను నిద్రపోతుండగా అమ్మను ఎవరో కొట్టి చంపారని మొసలి కన్నీరు కార్చింది.

    ఈ ఘటనపై యువతి తండ్రి బచ్నూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే.. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు. విచారణలో భాగంగా యువతి ప్రేమ వ్యవహారం గురించి, తల్లితో గొడవల గురించి తెలుసుకున్న పోలీసులు సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసింది. ఆమె కూతురితో కలిసి హత్య చేసినట్లు.. రక్తంతో ఉన్న ఆ ఇటుక రాయిని స్టోర్ రూమ్‌లోకి విసిరేసినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు యువతిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. వారిపై హత్య కేసు నమోదు చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: