Home /News /crime /

IN TRICHY A YOUNG WOMAN COMPLAINT AGAINST HER ROMANTIC HUSBAND HAS CAUSED A STIR SSR

Wife Pregnancy: ఇంతకన్నా పాపం ఉంటుందా.. భార్య గర్భంపై భర్తకు అనుమానం.. చివరకు ఎంతపని చేశాడంటే..

దివ్య, జ్ఞానశేఖరన్ పెళ్లి ఫొటో

దివ్య, జ్ఞానశేఖరన్ పెళ్లి ఫొటో

వాళ్లిద్దరూ ఒకే వీధిలో ఉండేవారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

    తిరుచ్చి: వాళ్లిద్దరూ ఒకే వీధిలో ఉండేవారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చింది. పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడ పిల్ల పుట్టిందన్న కారణంగానో లేక డబ్బుపై వ్యామోహంతోనో ‘ఈ బిడ్డ మనిద్దరికే పుట్టిందన్న గ్యారెంటీ ఏంటి.. పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురా’ అని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చెప్పేసరికి విస్తుపోవడం భార్య వంతైంది. బిడ్డ పుట్టిన కొద్దిరోజులకే భార్యను ఆ భర్త వదిలేశాడు. అంతేకాదు.. ఆ ప్రబుద్ధుడు మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. దీంతో.. ఏం చేయాలో పాలుపోని ఆ వివాహిత పుట్టిన బిడ్డతో కలిసి అత్తింటి ముందు కూర్చుంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి అన్నానగర్ ప్రాంతంలో దివ్య(31) అనే యువతి నివాసం ఉంటుండేది. అదే వీధికి చెందిన జ్ఞానశేఖరన్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొన్నాళ్లకు స్నేహంగా మారింది. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడటంతో ప్రేమించుకున్నారు. సినిమాలు, షికార్లకు ఇద్దరూ సరదాగా వెళ్లేవారు.

    అయితే.. ఈ క్రమంలోనే ఆమెతో జ్ఞానశేఖరన్ శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెను ఒప్పించాడు. ఇద్దరూ శారీరకంగా పలుమార్లు కలిశారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో.. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఈ గర్భం తన వల్లే వచ్చిందని గ్యారెంటీ ఏంటని ఆమెను నిలదీశాడు. తనకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించడంతో ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. కానీ.. పెళ్లి చేసుకుని ఆమె పాపకు జన్మనివ్వగానే అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. దివ్యను కట్నం కోసం వేధించసాగాడు. అంతేకాకుండా ఆమెకు అత్తింటి వేధింపులు కూడా పెరిగిపోయాయి. చివరకు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో భార్య దివ్యకు తెలియలేదు. కానీ.. కొన్ని రోజులకు ఆమెకు గుండె పగిలే నిజం తెలిసింది. తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడని తెలిసి తట్టుకోలేకపోయింది.

    ఇది కూడా చదవండి: Shocking: స్నేహితుడి భార్యతో ఫోన్‌లో సెక్స్ టాక్.. చివరకు ఏం జరిగిందో తెలిసి పోలీసులతో పాటు అంతా షాక్..

    అత్తింటి ముందే తనకు న్యాయం చేయాలని కూర్చుంది. ఆమెకు పుట్టింటి వాళ్లు, బంధువులు అండగా నిలిచారు. తన క్యారెక్టర్‌ను అనుమానిస్తూ.. ఈ బిడ్డకు, తనకూ సంబంధం లేదన్నట్టుగా జ్ఞానశేఖరన్ మాట్లాడేవాడని బాధితురాలు దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తనను వదిలించుకుని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడని.. తనకు న్యాయం చేయాలని దివ్య కోరింది. తిరుచ్చి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బాధితురాలు స్టేషన్ ఎదుట చంటి పాపతో ధర్నాకు దిగింది. ఈ విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి దివ్యతో మాట్లాడారు. ఫిర్యాదుపై సీరియస్‌గా దర్యాప్తు జరిపి న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు హామీ ఇవ్వడంతో దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి క్యారెక్టర్‌ను తప్పుబడుతూ.. భార్యను, పసికందును రోడ్డుపాలు చేసిన అతనిని కఠినంగా శిక్షించాలని దివ్య కుటుంబం డిమాండ్ చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Husband, Love marriage, Pregnant, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు