యాదాద్రిభువనగిరి జిల్లాలో దారుణం.. అప్పుడే పుట్టిన శిశువు రోడ్డు పక్కన..

మాదాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేసిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పాప ప్రాణాలు కోల్పోయింది.

news18-telugu
Updated: June 1, 2020, 12:08 PM IST
యాదాద్రిభువనగిరి జిల్లాలో దారుణం.. అప్పుడే పుట్టిన శిశువు రోడ్డు పక్కన..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యాదాద్రిభువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన ఇది. యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జరిగింది. మాదాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును పడేసిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పాప ప్రాణాలు కోల్పోయింది. పెళ్లికాని యువతి ప్రసవించడంతో ఇక్కడ పడేసి ఉంటారా? లేక మరేదైనా కారణంతో ఇక్కడ పడేసి పోయి ఉంటారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మాత్రం పెళ్లికాని యువతి ప్రసవించడంతో ఎవ్వరికీ తెలియక కుండా ఇక్కడ పడేసిపోయి ఉంటారని చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆస్పత్రుల్లో పెద్దగా రద్దీ లేకపోవడం.. అంత సులభంగా ప్రసవం చేసే పరిస్థితి లేకపోవడంతో ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
First published: June 1, 2020, 11:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading