యూట్యూబ్ వీడియో చూసి ఏటీఎం చోరీకి ప్రయత్నించి...ఇంతలోనే...

ఏటీఎం సమీపంలో అనుమానాస్పందంగా తిరుగుతున్న సుమిత్ సింగ్‌ని ఆపి పోలీసులు ప్రశ్నించారు. కాస్త తొట్రుపడుతూ సమాధానాలు చెబుతుండే సరికి పోలీసులకు అనుమానం వచ్చింది.

news18-telugu
Updated: June 30, 2020, 11:25 PM IST
యూట్యూబ్ వీడియో చూసి ఏటీఎం చోరీకి ప్రయత్నించి...ఇంతలోనే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏటీఎం కొల్లగొట్టాలను కొని ఓ ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు. హర్యానాకు చెందిన సుమిత్ సింగ్ ఏటీఎంని ఎలా చోరీ చేయాలో ఇంటర్నెట్ లో చూశాడు. సరిగ్గా అలాగే తన ప్లాన్ అమలు చేశాడు. పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. చండీగడ్ లోని సెక్టార్ 26లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సమీపంలో అనుమానాస్పందంగా తిరుగుతున్న సుమిత్ సింగ్‌ని ఆపి పోలీసులు ప్రశ్నించారు. కాస్త తొట్రుపడుతూ సమాధానాలు చెబుతుండే సరికి పోలీసులకు అనుమానం వచ్చింది. అక్కడ పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లి పరిశీలించగా ఏటీఎం పగులగొట్టే పరికరాలు అందులో కనిపించాయి. అతడిపై అనుమానాన్ని బలపరచుకున్న పోలీసులు సింగ్‌ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతడిని విచారించిన పోలీసులకు విస్తుపోయే సమాధానాలు చెప్పాడు. తాను గతంలో మెకానిక్ అని ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతుండడతో ఇలా దొంగతనాలకు పాల్పడినట్లు వివరించాడు.

ఏటీఎం దోచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఇంటర్నెట్ లో చూసి దొంగతనం చేయాలనుకన్నట్లు పోలీసులకు వివరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కారుతో పాటు గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్, ఏటీఎం కార్డులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
First published: June 30, 2020, 11:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading