ఒక రోజు వ్యవధిలో ఇద్దరు కూతుళ్ల మృతి.. అసలు ఏం జరిగిందంటే..

అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలు రోజుల వ్యవధిలో కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఒకే ఇంటికి చెందిన అక్కాచెల్లెలు రోజుల వ్యవధితో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: April 12, 2020, 4:16 PM IST
ఒక రోజు వ్యవధిలో ఇద్దరు కూతుళ్ల మృతి.. అసలు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలిద్దరూ ఒకే రోజు వ్యవధితో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదన అంతాఇంతా కాదు. ఒకే ఇంటికి చెందిన అక్కాచెల్లెలు రోజుల వ్యవధితో అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శావల్యపురం మండలం బొందిలిపాలెం కొత్త కాలనీలో యడవల్లి వెంకట్రావు, లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రవల్లిక(6), మోక్షిత(4) ఇద్దరు కూతుళ్లు. అయితే గత సోమవారం ఎప్పటిలాగే ఇంట్లో భోజనం చేసి ఆడుకున్నారు. అయితే ఉన్నట్టుండి మంగళవారం ప్రవల్లికకు వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో శావల్యాపురంలోని ఓ ప్రైవేటు డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.

అయినా ఆరోగ్య పరిస్థితి మెరగవ్వకపోవడంతో బుధవారం పెద్దకూతురు ప్రవల్లిక మరణించింది. అయితే అప్పటికే చిన్నకూతురు మోక్షితకు సైతం అనారోగ్యంగా ఉండడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మోక్షితను స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. మోక్షితకు వైద్య పరీక్షలు చేయగా, శరీరంలో పలు అవయవాలు సరిగా పనిచేయడం లేదని వైద్య పరీక్షల్లో తేలింది.

దీంతో మోక్షిత సైతం శుక్రవారం సాయంత్రానికి చనిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలు రోజుల వ్యవధిలో కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. విషయం తెలుసుకున్న ఎస్ఐ స్వర్ణలత శనివారం గ్రామానికి చేరుకుని ఇద్దరు కూతుళ్లు మృతిచెందడంపై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Published by: Narsimha Badhini
First published: April 12, 2020, 4:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading