Home /News /crime /

IN TAMIL NADU 16 YEAR OLD GIRL MOLESTED BY 3 MEN FROM 4 MONTHS NK

తమిళనాడులో దారుణం... బాలికపై నాలుగు నెలలుగా సామూహిక అత్యాచారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tamil Nadu : ఒక్కసారి అత్యాచారం జరిగిందంటే... అనుకోని పరిస్థితుల్లో జరిగిందనుకోవచ్చు. నాలుగు నెలలుగా ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారంటే... ఏమనుకోవాలి? దేశం ఎటు వెళ్తోంది?

  Tamil Nadu : తమిళనాడులోని తిరువారూర్‌‌లో జరిగిందీ దారుణం. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న ఓ దంపతులకు 16 ఏళ్ల కూతురు ఉంది. వాళ్ల ఇంటి ముందు మరో ఇల్లు ఉంది. అందులో జాన్సన్ అనే కుర్రాడు ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే... జాన్సన్ దగ్గరకు అప్పుడప్పుడూ వచ్చేవాడు కార్తీక్. ఓ రోజు ఎదురింటే... యువతిని చూశాడు. "రేయ్... ఎదురింట్లో అంత అంతమైన అమ్మాయుంది... లైన్లో పెట్టావా" అనడిగాడు. "ఏమోరా... నేనెప్పుడూ పట్టించుకోలేదు" అన్నాడు. "అవునా... ఐతే... నేను తగులుకుంటా" అంటూ ఆ యువతిపై కన్నేశాడు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే... ఫాలో అయ్యాడు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఓ రోజు ఆమెను తన రూంకి తీసుకెళ్లాడు. కూల్‌డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. దాంతో ఆమె... నిద్రమత్తులోకి జారుకుంది. ఆమెపై అత్యాచారం చేశాడు. నిజం తెలిశాక... ఆమె టెన్షన్ పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత... ఈ విషయాన్ని తన ఫ్రెండ్సైన జాన్సన్, విశ్వరాజ్‌లకు చెప్పాడు. "నువ్వామెను చేసుకుంటావా" అనడిగాడు జాన్సన్. "అంతలేదు... యూజ్ అండ్ త్రో" అన్నాడు. "అవునా... ఐతే... మాకూ ఛాన్స్ ఇవ్వరా" అనడిగారు వాళ్లిద్దరూ. "సరే" అంటూ ప్లాన్ వేశాడు. మరోసారి... ఆమెను తన రూంకి తీసుకెళ్లాడు కార్తీక్. అక్కడ ఆల్రెడీ జాన్సన్, విశ్వరాజ్ దాక్కున్నారు. ఆమెకు కార్తీక్... కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మత్తులోకి జారుకుంది. ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత... మళ్లీ సేమ్ కహానీ... పెళ్లి చేసుకుంటానని ఆమెను కార్తీక్ నమ్మించాడు. ఆ అమాయకురాలు నిజమే అనుకొని అతన్ని నమ్మింది. అలా ఆ ముగ్గురూ... ఆమెను నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తూనే ఉన్నారు.

  తాజాగా ఆమెకు కడుపునొప్పి రావడంతో... తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రెగ్నెన్సీ అని తేలింది. విషయమేంటని ప్రశ్నిస్తే... జరిగిన దారుణం చెప్పి ఏడ్చేసింది. వెంటనే వాళ్లు తిరువారూర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోక్సో యాక్ట్ కింద కేసు రాసిన ముందుగా... కార్తీక్‌ను పట్టుకున్నారు. ఈ విషయం తెలిసి... మిగతా ఇద్దరూ పారిపోయారు. వాళ్ల కోసం పోలీసులు వేటాడుతున్నారు.

  తమిళనాడులో ఇటీవల ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అది తిరుపత్తూరు జిల్లాలోని ఓ పల్లెటూరు. ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక చీకటి పడుతున్న సమయంలో బహిర్భూమికి బయల్దేరింది. ఐతే... ఆ తుప్పల ఏరియాలో... ముగ్గురు గాలోళ్లు మద్యం బాటిళ్లు తెచ్చుకొని... తాగడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న బాలికను ముగ్గురూ చూశారు. పరిగెత్తి బాలికను పట్టుకున్నారు. ఆమె కేకలు వేస్తుంటే... ముగ్గురిలో ఒకడు బాటిల్ పగలగొట్టి... విరిగిన బాటిల్ చూపించి... అరిచావంటే... దీన్ని పొట్టలో పొడుస్తా అన్నాడు. దాంతో బాలిక బాగా బయపడింది. ముగ్గురూ బాలికపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెప్పావో చంపుతాం అని బెదిరించారు. ఒంటిపై బట్టలు లేవు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. గాలోళ్లు చింపేసిన బట్టల్ని వేసుకున్న బాలిక... ఏడుస్తూ ఇంటికి వెళ్లింది. జరిగింది తల్లిదండ్రులకు చెప్పి బోరున ఏడ్చింది. పాపను హత్తుకున్న తల్లి... స్నానం చేయించింది. తర్వాత పాపను తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. కంప్లైంట్ నమోదైంది. పోలీసులు... బృందాలుగా ఏర్పడి... వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేశారు. బాలిక చెప్పిన వివరాలతో... ముగ్గురిలో ఒక వ్యక్తిని గుర్తుపట్టారు. అతన్ని పట్టుకోవడానికి వెళ్లగా... ముగ్గురూ కనిపించారు. ముగ్గుర్నీ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Molestation

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు