20 అడుగుల ఎత్తులో పార్టీ.. పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ మాయమైన యువతి.. తీరా ఏమైందా అని చూస్తే.. వీడియో వైరల్..

పార్టీలో పాల్గొన్న స్నేహితులు

ఓ కుర్రాడి ఇంట్లో రెండో అంతస్తులో హౌస్‌ పార్టీ జరుగుతోంది. అతను, అతని స్నేహితులు అంతా కలసి ఆడుతూ, పాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎంజెల్‌ పాట పాడుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. వెనుక ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలూ డ్యాన్స్‌ వేస్తున్నారు. ఇంతలో ఏమైందో కానీ... వెనుక ఉన్నఓ యువతి ఒక్కసారిగా మాయమైంది. అసలేమైందంటే..

  • Share this:
అది కొలంబియాలోని బారాన్‌క్విల్లా.. ఎంజెల్‌ మెలోడీ అనే కుర్రాడి ఇంట్లో ఇంట్లోని రెండో అంతస్తులో హౌస్‌ పార్టీ జరుగుతోంది. అతను, అతని స్నేహితులు అంతా కలసి ఆడుతూ, పాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎంజెల్‌ పాట పాడుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నాడు. వెనుక ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలూ డ్యాన్స్‌ వేస్తున్నారు. ఇంతలో ఏమైందో కానీ... వెనుక ఉన్న గ్రేసీ గ్రేసియా అనే యువతి ఒక్కసారిగా మాయమైంది. ఏమైందా అని చూస్తే... ఒళ్లుగగుర్పొడిచే విషయం తెలిసింది. ఇంతకీ ఏమైందంటే? పార్టీలో డ్యాన్స్‌ వేస్తున్న గ్రేసియా ఒక్కసారిగా కనిపించకపోయేసరికి ఆమె స్నేహితులు ఆశ్చర్యపోయారు. తేరుకొని చూసేసరికి గ్రేసియా ఆ వెనుక ఉన్న కిటికీ నుంచి పొరపాటున కింద పడిపోయింది. 20 అడుగుల ఎత్తు నుంచి జారిపోయిన గ్రేసియాను స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు ప్రాణ భయం ఏమీ లేదని తేల్చారు. అంత ఎత్తు నుంచి జారి కింద పడటం వల్ల శరీరంలో కొన్ని చోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు తేల్చారు.

వెంటనే కావాల్సిన వైద్యం ప్రారంభించారు. ఆసుపత్రిలో చేరిన గ్రేసియా 40 నిమిషాల తర్వాత స్ఫృహలోకి వచ్చిందట. మామూలుగా అయితే... అంత ఎత్తు నుంచి పడిపోతే ప్రాణాల మీదకు వస్తుంది అంటారు. కానీ గ్రేసియా అదృష్టం వల్ల ప్రాణ భయం లేకుండా గాయాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కింద కామెంట్స్‌ చూస్తే.. నెటిజన్లు తలో రకంగా స్పందించారు. కొందరేమో గ్రేసియా మృత్యుంజయురాలు అని రాస్తుండగా, ఇంకొందరేమో కిటికీల దగ్గర ఇలా డ్యాన్సులు వేయడం, పార్టీలు చేసుకోవడం ఏమంత మంచిది కాదని సూచిస్తున్నారు.

ఈ వీడియోను చూసినవారికి.. గ్రేసియా మాయమైనట్లు మాత్రమే కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఏమైందో తెలుసుకోవడానికి వార్తలు వెతికేవారికి అసలు విషయం తెలుస్తోంది. మీరు కూడా గతంలో ఇలాంటివి కొన్ని చూసే ఉంటారు. అప్పటివరకు కనిపించిన మనుషులు ఒక్కసారిగా మాయమవ్వడంతో ఏమైందో తెలియక కంగారుపడి ఉంటారు. గ్రేసీ విషయంలో కూడా ముందు ఏదో మ్యాజిక్ ఏమో అనుకున్నారు. కానీ వీడియోను నిశితంగా పరిశీలించిన తరువాతే అసలు విషయం అందరికీ తెలిసింది.
Published by:Veera Babu
First published: