భర్త కళ్ల ముందే భార్యపై... మాజీ భర్త సోదరుడు రేప్... చిచ్చురేపిన ఆ గొడవే కారణమా?

భర్త కళ్ల ముందే భార్యపై... మాజీ భర్త సోదరుడు రేప్... చిచ్చురేపిన ఆ గొడవే కారణమా? (ప్రతీకాత్మక చిత్రం)

మన దేశంలో పట్టపగలు జరిగిన దారుణం ఇది. మాజీ భర్త సోదరుడు ఎందుకు అంతకు తెగించాడు? ఆమెపై అతనికి ఎందుకు అంత పగ? తెరవెనక ఏం జరిగింది?

 • Share this:
  రాజస్థాన్... బరాన్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఓ మహిళ మాజీ భర్త సోదరుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె భర్త కళ్లముందే ఆమెను రేప్ చేశాడు. ఘటన జరిగిన రోజున ఆమె... తన ప్రస్తుత భర్త, తన బిడ్డ, తన చెల్లితో కలిసి... భర్త ఇంటికి వెళ్తోంది. అది సాజావార్ ఊరి చివర ప్రాంతం. సరిగ్గా ఆ సమయంలో... మాజీ భర్త సోదరుడు... మరో నలుగురు వారికి అడ్డుగా వచ్చి... ఆపారు. వాళ్లను చూడగానే ఆమె గుర్తుపట్టింది. వాళ్లలో ఒకడు తన మాజీ భర్త సోదరుడు అని గ్రహించింది. వాళ్లను పట్టించుకోకుండా వెళ్లిపోదామనుకుంటే... సినిమాల్లో విలన్లలాగా ఆ ఫ్యామిలీని అడ్డుకున్నారు. ముందుగా భర్తను రౌండప్ చేసి... పిడిగుద్దులు గుద్ది... తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ తర్వాత... ఆ ఫ్యామిలీని కత్తులతో బెదిరించి... అక్కడి పొలంవైపు లాక్కెళ్లారు.

  పొలంలో... ప్రస్తుత భర్త చూస్తుండగానే... మాజీ భర్త సోదరుడు... ఆమెను రేప్ చేశాడు. తన కళ్ల ముందే తన భార్యను రేప్ చేస్తుంటే... ఆ భర్త ఏమీ చెయ్యలని నిస్సహాయుడు అయ్యాడు. అటు ఆమె చెల్లి కూడా వాళ్లను ఎదిరించే పరిస్థితిలో లేదు. అత్యాచారం తర్వాత... నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  ఘటన తర్వాత బాధితులు... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు రాసిన పోలీసులు... ఆమెను ఆస్పత్రికి తరలించారు. అసలు మాజీ భర్త సోదరుడు ఎందుకీ పని చేశాడని పోలీసులు ప్రశ్నించగా... ఆమె ఓ కారణం చెప్పింది. తనకు 20 ఏళ్లప్పుడే పెళ్లైందనీ... కానీ పిల్లలు పుట్టని కారణంగా... అతన్ని వదిలేశానని చెప్పింది. ఆ తర్వాత ఊరి వాళ్లు నాదా ప్రద సంప్రదాయం ప్రకారం... పెళ్లి వేడుక ఏదీ లేకుండా... మరో వ్యక్తితో పెళ్లి జరిపారని తెలిపింది.

  ఐదుగురిపై గ్యాంగ్ రేప్ కేసు రాసిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. రేప్ చేసిన వ్యక్తితోపాటూ... మరో ఇద్దరు ఓ రోడ్డుపై ఎవరో వాహన దారుణ్ని బెదిరించి... డబ్బు లాక్కోబోతుంటే... పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి వెర్షన్ మరోలా ఉంది. ఆమె తన అన్నయ్యను పిల్లలు లేరన్న కారణంతో వదిలేశాక... ఊళ్లో తమ పరువు పోయిందనీ... అందుకు కారణమైన ఆమెపై పగ తీర్చుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. అందుకే రేప్ చేశానన్నాడు.

  ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 17 రాశి ఫలాలు... ఈ రాశుల వారి శక్తి సామర్థ్యాలకు గుర్తింపు

  మిగతా ఇద్దర్ని కూడా పట్టుకొని... తగిన శిక్ష పడేలా చేసి... బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు తెలిపారు.
  Published by:Krishna Kumar N
  First published: