ముంబైలో లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు... నలుగురు డాక్టర్ల లైసెన్సులు రద్దు...

Mumbai Crime News : కులం పేరుతో సీనియర్లు వేధిస్తుంటే తట్టుకోలేక డాక్టర్ పాయల్ ఆత్మహత్య చేసుకోవడం మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం నలుగురు డాక్టర్లపై చర్యలు తీసుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 12:05 PM IST
ముంబైలో లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు... నలుగురు డాక్టర్ల లైసెన్సులు రద్దు...
ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ పాయల్ (File)
  • Share this:
ముంబై సెంట్రల్‌లోని BYL నాయర్ హాస్పిటల్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా చేస్తున్న 26 ఏళ్ల పాయల్... మే 22న ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఆమె సూసైడ్‌కి కారణమైన డాక్టర్లపై చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రజలు డిమాండ్ చెయ్యడంతో... ప్రభుత్వం దిగి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు డాక్టర్ల లైసెన్సులను సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురు సీనియర్ మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ హేమా అహూజా, డాక్టర్ భక్తి మెహర్, డాక్టర్ అంకితా ఖండిల్వాల్ కాగా, మరొకరు... గైనకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ యి చింగ్ లింగ్. ప్రస్తుతం ముగ్గురు సీనియర్ మెడికల్ స్టూడెంట్సూ పరారీలో ఉన్నారు. నిజానికి వాళ్లు యాంటీ-ర్యాగింగ్ కమిటీ ముందు హాజరుకావాల్సి ఉంది. అలా జరగకపోవడంతో, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్... నలుగురి లైసెన్సులూ సస్పెండ్ చేసింది. ఈ కేసులో ఎంక్వైరీ పూర్తయ్యే వరకూ వారి లైసెన్సులు సస్పెన్షన్‌లో ఉంటాయని BMC తెలిపింది. ఈ కేసుపై అంతర్గతంగా దర్యాప్తు జరుపుతున్న కమిటీ... తన రిపోర్టును ఇవాళ మహారాష్ట్ర యూనిర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి ఇచ్చే అవకాశాలున్నాయి.

ముంబై సెంట్రల్‌లోని BYL నాయర్ హాస్పిటల్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా చేస్తున్న 26 ఏళ్ల పాయల్... మే 22న ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. హాస్పిటల్‌లో తక్కువ కులం అంటూ ఆమెను సీనియర్లు పదే పదే వేధిస్తుంటే, భరించలేకే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేధింపులపై ఇదివరకు లెక్చరర్లకు కంప్లైంట్లు ఇచ్చినా, వాళ్లు పట్టించుకోలేదనీ, దీనిపై డీన్‌తో మాట్లాడదామంటే, తమను అనుమతించలేదని పాయల్ తల్లి అబేదా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి న్యాయం జరగాలన్న ఆమె... వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిండాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాకు చెందిన పాయల్... టోపీవాలా నేషనల్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ విభాగంలో పీజీ కోర్స్ చేసేందుకు జాయిన్ అయ్యింది. ఈ కాలేజీ... BYL నాయర్ కాలేజీతో 2018 మే 1 అటాచ్ అయ్యింది.

గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ డాక్టర్లు తన భార్యను రకరకాలుగా వేధించారని పాయల్ భర్త డాక్టర్ సల్మాన్ డిపార్ట్‌మెంట్ పెద్దలకు డిసెంబర్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెలలు సైలెంటైన సీనియర్లు మళ్లీ వేధింపులు మొదలుపెట్టడంతో పాయల్ తీవ్ర ఆవేదన చెందింది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి, ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆమె తల్లి అగ్రిపద పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. పాయల్‌ను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమా అహూజా, భక్తి మెహర్, అంకిత ఖండేల్వాల్‌ను అరెస్టు చెయ్యకపోవడంపై విమర్శలొస్తున్నాయి. దీనిపై గైనకాలజీ డిపార్ట్‌మెంట్‌కి షోకాజ్ నోటీస్ పంపినట్లు కాలేజీ డీన్ డాక్టర్ రమేష్ భర్మల్ తెలిపారు.

డాక్టర్ ఆత్మహత్యపై మే 28న గిరిజన తెగలు... ఆందోళన చెయ్యాలని నిర్ణయించారు. సూసైడ్‌కి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి :

ఏపీకి IAS శ్రీలక్ష్మీ... అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి... 1న బాధ్యతలువైరల్ వీడియో... స్టేజీపై పాడుతూ... కుప్పకూలి చనిపోయిన ఎస్సై...

తెలంగాణలో ఐదుగురు మంత్రులు ఔట్..? లోక్ సభ ఎన్నికల ఫలితం...

జూన్ 5 వరకూ తీవ్ర ఎండలే... RTGS హెచ్చరిక... బయటకు వెళ్లొద్దు...
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు