హోమ్ /వార్తలు /క్రైమ్ /

Heartbreaking: ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ కుటుంబానికి ఇలాంటి రోజొకటి ఎందుకొచ్చిందో...

Heartbreaking: ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ కుటుంబానికి ఇలాంటి రోజొకటి ఎందుకొచ్చిందో...

దీన్‌దయాల్ అరోరా కుటుంబం

దీన్‌దయాల్ అరోరా కుటుంబం

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాద ఘటన జరిగింది. బట్టల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను, భార్యను చంపి ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది.

జో‌ధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాద ఘటన జరిగింది. బట్టల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుర్లను, భార్యను చంపి ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. జో‌ధ్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్ రోడ్‌లో ఆ వ్యాపారి కుటుంబం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దీన్‌దయాల్ అరోరా(45), సరోజ(42) దంపతులు. వీరికి 13 ఏళ్ల వయసున్న హిరాల్, ఏడేళ్ల వయసున్న తన్వి అనే కూతుర్లు ఉన్నారు. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. దీన్‌దయాల్ క్లాత్ మర్చంట్‌గా వ్యాపారం చేస్తుండేవాడు.

కూరగాయల మార్కెట్‌ సెంటర్‌లో ఇతనికి వస్త్ర దుకాణం కూడా ఉంది. రోజూ ఉదయాన్నే దుకాణం తీసేందుకు వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం, మళ్లీ రాత్రి వరకూ దుకాణంలోనే వ్యాపారం చేయడం.. ఆదివారం కుటుంబ సభ్యులతో గడపటం.. ఇదే దీన్‌దయాల్ దినచర్య. ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. కానీ.. ఏం జరిగిందో తెలియదు గానీ ఇటీవల ఒక రోజు ఉదయం పది గంటలవుతున్నా ఇంటి తలుపులు తెరుచుకోలేదు. ఇంట్లో ఎలాంటి చడీచప్పుడు లేదు.

ఇది కూడా చదవండి: Lover: ఇది ప్రేమా.. ఇతను ఒకమ్మాయిని లవ్ చేశాడు.. ఆమెకు మరొకరితో పెళ్లి అయిపోయిందని తెలిసి..

ఇరుగుపొరుగు వాళ్లు ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాలేదు. ఏం జరిగిందో అర్థం కాక బంధువులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి తలుపులు బద్ధలు కొట్టి చూసేసరికి షాకింగ్ దృశ్యం కనిపించింది. నట్టింట్లో దీన్‌దయాల్ ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఆయన భార్యాపిల్లలు అచేతనంగా కింద పడి కనిపించారు. అప్పటికే నలుగురూ చనిపోయారు. పోలీస్ కమిషనర్ జోస్ మోహన్ ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ఫోరెన్సిక్ టీం స్పాట్‌కు చేరుకుని కొన్ని కీలక ఆధారాలను సేకరించింది.

ఇది కూడా చదవండి: WifeHusband: భార్యాభర్తలంటే కష్టసుఖాలను పంచుకోవాలి.. కానీ వీళ్లిద్దరు మాత్రం.. ఈ చండాలం గురించి ఏం చెప్తాం..!

ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. దీన్‌దయాల్ తన భార్యాపిల్లలకు విషమిచ్చి చంపేశాడని, అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల గానీ లేక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు జరిగిన నేపథ్యంలో గానీ ఇలా జరిగిందా అనే విషయాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఏదేమైనా.. దీన్‌దయాల్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ అపార్ట్‌మెంట్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఈ కుటుంబం అందరితో కలిసిమెలిసి ఉండేవారని, ఎవరితో గొడవ పెట్టుకున్న సందర్భాలు కూడా లేవని అపార్ట్‌మెంట్ వాసులు చెప్పుకొచ్చారు.

First published:

Tags: Crime news, Family suicide, Husband commits suicide, Rajasthan

ఉత్తమ కథలు