Very Sad Incident: పాపం అమ్మాయి.. అమ్మలా ఉంటుందనుకున్న అక్కను నమ్మింది.. కానీ ఆ రాక్షసి ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

పోలీసులు విచారణ చేపట్టి అసలు బాలిక హత్యకు కారణం ఏంటనే విషయాన్ని తేల్చారు. రాఖీదేవి ప్రియుడు ప్రతాప్, నితిష్.. ఆమె చెల్లెలపై కన్నేశారు. తరచూ రాఖీదేవి ఇంటికి వచ్చి బాలికతో అసభ్యంగా పవర్తించేవారు.

  • Share this:
    రాంచీ: చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తరువాత ఆమెకు అక్కే పెద్ద దిక్కు అయ్యింది. 17 ఏళ్లు వచ్చేంతవరకు అక్క దగ్గరే ఉంది ఆ అమ్మాయి. కానీ ఓ వయసు వచ్చిన తరువాత కానీ ఆమెకు తెలియదు తన అక్కడ ఏం చేస్తుందో.. తనను ఇంతకాలం ఎందుకు దగ్గర ఉంచుకుని పెంచిందో. ఎన్నో ఆశలతో మంచి జీవితం గడుపుదామని భావించిన ఆ అమ్మాయి.. చివరకు హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఏడు నెలల క్రితం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలిక హత్య కేసుకు సంబంధించి ఆమె అక్కలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మృతురాలి అక్కలు రాఖీ దేవి, రూపా దేవీ, రాఖీ భర్త ధనంజయ్, ఆమె ఇద్దరు ప్రియులు ప్రతాప్ సింగ్, నితిష్‌కు ఈ కేసుతో సంబంధం ఉందని తేల్చారు పోలీసులు.

    వీరిలో నితీష్ మినహా అందరినీ అరెస్ట్ చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె తలకు బలమైన గాయం ఉందని తేల్చారు. అయితే ఆమె అక్కలు మాత్రం బాధితురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. అయితే పోలీసులు విచారణ చేపట్టి అసలు బాలిక హత్యకు కారణం ఏంటనే విషయాన్ని తేల్చారు. ఐదుగురు అక్క చెల్లెళ్లలో నాలుగో అమ్మాయి అయిన బాధితురాలు.. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో సెక్స్ వర్కర్ అయిన తన పెద్ద అక్క రాఖీదేవి దగ్గర ఉంటోంది. కొద్దిరోజుల నుంచి బాధితురాలిని రాఖీ దేవి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది.

    అయితే అందుకు బాధితురాలు నిరాకరించింది. అయినా అనేకసార్లు ఆమెకు ఇష్టం లేకుండానే పలువురు విటులను ఆమె గదికి పంపించారు. అయినా బాధితురాలు వారికి లొంగలేదు. మరొకరితో బాధితురాలికి సంబంధం ఉంది. అయితే చెల్లెలు అతడిని పెళ్లి చేసుకునేందుకు రాఖి దేవి ఒప్పుకోలేదు. అంతేకాదు రాఖీదేవి ప్రియుడు ప్రతాప్, నితిష్.. ఆమె చెల్లెలపై కన్నేశారు.

    Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

    After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

    తరచూ రాఖీదేవి ఇంటికి వచ్చి బాలికతో అసభ్యంగా పవర్తించేవారు. ఆమె చనిపోవడానికి రెండు రోజుల ముందు కూడా అక్కడికి వచ్చిన ప్రతాప్, నితీష్.. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపి ఉరి వేసుకున్నట్టుగా చిత్రీకరించారు. ఆమెను వెంటనే రాఖీ దేవి, ఆమె భర్త ధనంజయ రిక్షాలో తీసుకెళ్లి సమీపంలో డ్యామ్‌లో పడేశారు. ఆమె బట్టలు మార్చి అనుమానం రాకుండా చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: