కోర్టులో నిజానిజాలను పరిశీలించి దోషికి శిక్ష వేస్తారు. ఏ దేశమైనా సరే న్యాయ వ్యవస్థ ఇలాగే ఉంటుంది. తీర్పు చెప్పడంలో ఒక్క ఆధారం అటూ ఇటూ అయినా జీవితాలే మారిపోతాయి. దోషి తప్పించుకున్నా పర్లేదు కానీ, నిర్దోషికి శిక్ష పడొద్దనేది ధర్మం. కానీ, కొన్ని సార్లు నిర్దోషులు బలైన సంఘటనలు మనం ఎన్నో సార్లు చూశాం. అలాంటి ఘటనే ముంబైలో జరిగింది. వివరాల్లోకెళితే.. పొరుగింటి యువతిపై అత్యాచారం కేసులో 17 నెలల శిక్ష తర్వాత నిందితుడికి బెయిల్ లభించింది. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా బాధితురాలి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతను తండ్రి కాదని తేలడంతో కోర్టు బెయిల్ ముంజూరు చేసింది. అసలు ఏం జరిగిందంటే పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన యువతి పాఠశాలలో ఉండగానే విపరీతమైన కడపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. టెస్ట్ ల తర్వాత ఆ యువతి గర్భవతి అని తేలింది. దీంతో ఆ యువతిని తల్లిదండ్రులు ఆరా తీయగా.. పక్కింటి వ్యక్తే తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో 2019 జూలై23న అతడిపై కేసు నమోదు కాగా, 17నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు.
అయితే ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని నిందితుడు తెలిపాడు. తను ఏ తప్పు చేయలేదంటూ రెండుసార్లు బెయిల్ దాఖలు చేశాడు. అయినప్పటికీ ప్రాసిక్యూషన్ ఈ అభ్యర్ధనను తీవ్రంగా వ్యతిరేకించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అతనికి బెయిల్ నిరాకరించింది. అయితే, తాజాగా డీఎన్ఏ రిపోర్ట్ తో అసలు విషయం బయటికొచ్చింది. ఆ డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా ఆ యువతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అతడు తండ్రి కాదని తేలడంతో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
Published by:Sridhar Reddy
First published:January 25, 2021, 12:24 IST