హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో అమానుషం.. ఇద్దరు చిన్నారులకు బలవంతంగా పశువుల పేడ తినిపించి మరీ...

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో అమానుషం.. ఇద్దరు చిన్నారులకు బలవంతంగా పశువుల పేడ తినిపించి మరీ...

చిన్నారులను కొడుతున్న దృశ్యం

చిన్నారులను కొడుతున్న దృశ్యం

చిన్నారులను తాడుతో కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టారు. నోట్లో పశువుల పేడ కుక్కి రాక్షసత్వంగా ప్రవర్తించారు. వారు పెట్టె హింస తట్టుకోలేక ఆర్తనాదాలు చేసినా వదల్లేదు... అసలేం జరిగింది..

Mahabubabad: చిన్నారులను తాడుతో కట్టేసి కర్రలతో దారుణంగా కొట్టారు. నోట్లో పశువుల పేడ కుక్కి రాక్షసత్వంగా ప్రవర్తించారు. వారు పెట్టె హింస తట్టుకోలేక ఆర్తనాదాలు చేసినా వదల్లేదు... అసలేం జరిగింది.. మామిడి కాయలు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు చిన్నారులను దారుణంగా కట్టేసి కొట్టిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ మండలంలోని చింతపల్లి గ్రామ శివారులోని బొత్తల తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తొర్రూర్‌ కు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మధ్యలో మామిటి తొట చూసి ఆగారు. అక్కడికి వెళ్లి మామిడి పిందెలను తెంపారు. విషయం తెలుసుకున్న తోట కాపలాదురుడు బానోత్‌ యాకూబ్‌ పరుగున వచ్చి చిన్నారుల చేతులను కట్టేశాడు. తోటి కాపలాదారుడు బానోత్‌ రాములుతో కలిసి కర్రలతో ఆ ఇద్దరు చిన్నారులను విచక్షణారహితంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా ఆవు పేడను ఇద్దరి నోట్లో కుక్కి మరీ దారుణంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు.


కనికరించని తొటమాలిలు...

మమ్మల్ని వదిలిపెట్టండంటూ వేడుకున్నా తొటమాలిలు కనికరించలేదు. తోట పక్క నుంచి వెళ్తున్న తండా వాసి ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతో మామిడి కాయలను దొంగతనం చేసినంత మాత్రానా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై నగేశ్‌ తెలిపారు.

First published:

Tags: Crime news, Mahabubabad, Telangana, Thorrur, Viral Video

ఉత్తమ కథలు