Crime : దేశంలో కామాంధుల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిర్భయ చట్టం.. దాని కంటే కఠిన చట్టాలు.. ఆఖరికి ఎన్కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేకపోతున్నాయి.
దేశంలో కామాంధుల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిర్భయ చట్టం.. దాని కంటే కఠిన చట్టాలు.. ఆఖరికి ఎన్కౌంటర్ వంటి ఘటనలు జరిగినప్పటికి ఇవేవి కామాంధులను భయపెట్టలేకపోతున్నాయి. దేశంలో రోజురోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయి. ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల మనవరాల్ని తీసుకుని వస్తుండగా ఆరుగురు యువకులు అడ్డుకుని..వారిని దారుణంగా కొట్టి..బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ ముగ్గుర్ని రాళ్ల కొట్టి దారుణంగా చంపారు. ఈ దారుణం ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..ఓ వ్యక్తి తన కుమార్తె, మనవరాలిని తసుకొని ద్విచక్రవాహనంపై కోరాయి గ్రామానికి వెళుతుండగా.. మద్యం తాగిన ఆరుగురు యువకులు వారిని ఆపారు. ఆ తర్వాత ముగ్గుర్ని కొట్టి 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు వారిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. ఇంటి నుంచి బయటకి వెళ్లిన వారు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన..మృతుడి కుమారుడు ఫిబ్రవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలించగా.. సంఘటనా స్థలంలో తండ్రి, మనవరాలు మరణించి ఉన్నారు.
అయితే, అత్యాచారానికి గురైన బాలిక తీవ్ర గాయాలతో పడి ఉండగా ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది.ఈ సంఘటన జనవరి 29న ఛత్తీస్ఘడ్ కోర్బా జిల్లాలోని లెమ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్రెంగా గ్రామ సమీపంలో జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంద్రం మజ్వార్, అబ్దుల్ జబ్బార్, అనిల్ కుమార్, రామ్ పానికా, ఆనంద్ రామ్ పానికా, శంకర్ యాదవ్ ఈ దారుణానికి పాల్పడ్డారని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.
నిందితులపై ఐపీసీ సెక్షన్ 302, 376(2) జి, ఎస్సీఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఛత్తీస్ ఘర్ లో ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయ్. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్.