సభ్యసమాజం తలదించుకునే విధంగా అక్కడి జనం ప్రవర్తించారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తర్వాత తన భార్య క్యారెక్టర్ మంచిది కాదంటూ భర్త, అత్తమామలు ఓ వివాహిత(Married woman)పై చెడు ముద్ర వేసి బజారుకీడ్చిన ఘటన బీహార్ (Bihar)దర్బాంగ(Darbhanga)లో చోటుచేసుకుంది. అమానవీయంగా, అత్యంత దారుణంగా ఓ మహిళ అని కూడా చూడకుండా..అత్తారింటి వాళ్లు ఆమెను అవమానించడంతో ఊరి జనం ఆమెకు దేహశుద్ధి చేసి ఊరేగించారు. దర్బాంగకు చెందిన రణ్‌వీర్ సదా (Ranveer sada)అనే వ్యక్తి ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే భార్యను అనుమానించసాగాడు. భర్త, అత్త,మామలతో కలిసి ఉంటుండగానే ఆమె ప్రవర్తన నచ్చకపోవడంతో ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. గ్రామ పెద్దల ముందు తన భార్య క్యారెక్టర్ మంచిది (Characterless)కాదని ఆమెతో కాపురం చేయనని చెప్పడంతో ..గ్రామస్తులు రణ్‌వీర్ సదా మాటలు నమ్మారు. ఊరి జనం, గ్రామంలోని కుర్రాళ్లంతా రణ్‌వీర్ సదా భార్యకు దేహశుద్ధి చేశారు. జుట్టు కత్తిరించి, ముఖానికి మసి, సున్నం పూసి దుర్భాషలాడుతూ నోటికొచ్చినట్లు తిడుతూ గ్రామంలోని రోడ్లపై ఊరేగించారు. అంతే కాదు దారి పొడవున ఆమెను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ కొట్టుకుంటూ చేతులు పట్టుకొని రోడ్లపై ఈడ్చుకెళ్లారు. మహిళ పట్ల గ్రామస్తులు ప్రవర్తించిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియో (Viral video)సోషల్ మీడియా (Social media)లో వైరల్ అవుతోంది.
వివాహితకు అవమానం..
భర్త, అత్తమామలు వేసిన నిందతో పాటు గ్రామస్తులు చేసిన అవమానం భరించలేకపోయింది బాధితురాలు. తన మాట ఎవరూ నమ్మకపోవడంతో ఊరి జనం వేస్తున్నశిక్షను అనుభవించింది. గ్రామంలో ఊరేగించిన కుర్రాళ్లను ఆ వివాహితను చివరకు గ్రామం నుంచి వెళ్లిపోమ్మంటూ ఊరి చివర వదిలేశారు. ఓ సాధారణ గృహిణి పట్ల గ్రామస్తులు ప్రవర్తించిన తీరును చూసిన కొందరు సామాన్య పౌరులు ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మహిళకు దేహశుద్ది చేసిన వీడియో తెగ వైరల్ అయింది.
క్యారెక్టర్‌లెస్ అంటూ ముద్ర వేసిన భర్త..
గ్రామంలో ఇంతటి దారుణ ఘటన జరుగుతుంటే ఊళ్లో ప్రతి ఒక్కరూ చోద్యం చూస్తుండిపోయారు. అంతే కాదు మహిళను అవమానించిన ఘటనపై గ్రామంలోని సర్పంచ్ నుంచి పోలీసుల వరకూ అందరికి సమాచారం అందినప్పటికి నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులే కాదు గ్రామ పరిపాలన అధికారులు సైతం ఈ విషయంపై స్పందించకపోవడం నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుడుతున్నారు. మహిళకు జరిగిన అన్యాయానికి సంబంధించిన ఘటనలో నిజాలు రాబట్టి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Viral Video