Sad: అయ్యో పాపం.. భర్త ఇంకా ఇంటికి రాలేదేంటని కాల్ చేస్తే బయటే రింగ్ అయింది.. తీరా చూసేసరికి..

ప్రాణాలు కోల్పోయిన యోగేష్

చావుపుట్టుకలు అనేవి మనిషి చేతిలో ఉండవు. ఎప్పుడు మనిషి ప్రాణం పోతుందో.. ఎలా చనిపోతాడో కొన్నిసార్లు అస్సలు అంచనా వేయలేం. అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న వాళ్లే కాదు.. అకాల మరణం బారిన పడిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.

 • Share this:
  బీతల్: చావుపుట్టుకలు అనేవి మనిషి చేతిలో ఉండవు. ఎప్పుడు మనిషి ప్రాణం పోతుందో.. ఎలా చనిపోతాడో కొన్నిసార్లు అస్సలు అంచనా వేయలేం. అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న వాళ్లే కాదు.. అకాల మరణం బారిన పడిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వర్షం పడుతోందని మెట్రో స్టేషన్ కింద నిల్చుంటే పెచ్చులు ఊడి మీద పడి ప్రాణం పోయిన ఘటనలు గతంలో చూశాం. మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదని.. చావు ఎప్పుడైనా.. ఏ రూపంలోనైనా మనల్ని కమ్మేసే అవకాశం ఉందని రుజువు చేసే ఘటన మధ్యప్రదేశ్‌లోని బీతల్‌లో చోటుచేసుకుంది.

  గుట్కా నములుతున్న ఆ యువకుడు బయట ఉమ్మేసేందుకు ప్రయత్నించి గొంతు గ్రిల్స్ ఊచల మధ్య చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీతల్‌కు చెందిన యోగేష్ డోంగ్రే అనే యువకుడు మెడికల్ రిప్రెసెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి బయట పార్టీలో పాల్గొన్నాడు. మద్యం సేవించాడు. ఆ తర్వాత బైక్‌ను నడుపుకుంటూ ఒక్కడే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు.

  బైక్‌ను పార్క్ చేసి అప్పటికే నములుతున్న గుట్కాను బయటకు ఊసేద్దామని ప్రహరీ గోడ దగ్గరకు వెళ్లాడు. గ్రిల్స్ పై నుంచి బయటకు ఉమ్మేందుకు ప్రయత్నించిన క్రమంలో మద్యం మత్తులో ఉన్న యోగేష్ కాలు జారడంతో అదుపు తప్పి ఇనుప గ్రిల్ ఊచల మధ్య అతని మెడ ఇరుక్కుపోయింది. అర్ధరాత్రి సమయం కావడం, ఎవరూ యోగేష్‌ను గమనించకపోవడంతో కొంతసేపటికే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

  ఇది కూడా చదవండి: Shocking Incident: వామ్మో.. వామ్మో.. ఇదెక్కడి బరితెగింపురా బాబోయ్.. ఈ దృశ్యాలు ఎక్కడివంటే...

  భర్త ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలియని యోగేష్ భార్య అర్ధరాత్రి దాటుతున్నా భర్త ఇంటికి రాలేదేంటని కాల్ చేసింది. ఇంటి గోడ దగ్గర భర్త ఫోన్ రింగ్‌టోన్ వస్తున్న శబ్దం వినిపించడంతో కంగారుగా బయటకు వచ్చి చూసింది. భర్త మెడ ఆ ఇనుప గ్రిల్ మధ్య చిక్కుకుని.. అతను గోడకు ఒరిగిపోయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ఆమె ఏడుపు విన్న ఇరుగుపొరుగు వాళ్లు ఏమైందా అని బయటకు వచ్చి చూసేసరికి యోగేష్ విగతజీవిగా గ్రిల్‌ వద్ద కనిపించాడు. ఈ ఊహించని ఘటనతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

  ఇది కూడా చదవండి: Married Woman: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. తన కోసం వెంపర్లాడుతున్న మావయ్య.. ఈ కోడలి నిర్ణయం ఇది..

  అతనిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే యోగేష్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రిల్స్ దగ్గర గుట్కా ఉమ్మేసిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఊహించని ఈ ఘటనతో యోగేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని భార్యను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు.
  Published by:Sambasiva Reddy
  First published: