హోమ్ /వార్తలు /క్రైమ్ /

Son: పున్నామ నరకం నుంచి తప్పిస్తావనుకుంటే నువ్వే నిప్పంటించావే.. ఛీఛీ.. ఏం కొడుకువయ్యా..

Son: పున్నామ నరకం నుంచి తప్పిస్తావనుకుంటే నువ్వే నిప్పంటించావే.. ఛీఛీ.. ఏం కొడుకువయ్యా..

నిందితుడు ప్రశాంత్ జెనా (ఫైల్ ఫొటో)

నిందితుడు ప్రశాంత్ జెనా (ఫైల్ ఫొటో)

‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు' అంటారు. పున్నామ నరకం సంగతి అటుంచితే ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కన్నతల్లిని బతికుండగానే సజీవ దహనం చేసి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ పరిధిలో వెలుగుచూసింది.

భువనేశ్వర్: ‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడు' అంటారు. పున్నామ నరకం సంగతి అటుంచితే ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కన్నతల్లిని బతికుండగానే సజీవ దహనం చేసి చంపాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్‌లోని బాదగడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాళింగ మురికివాడలో రస్మిత జెనా అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు ప్రశాంత్ జెనా. చిన్న కొడుకు బసంత్ సవ్యంగా తన పని తాను చూసుకునేవాడే అయినప్పటికీ ఆమె పెద్ద కొడుకు ప్రశాంత్ జెనా మాత్రం చెడు అలవాట్లకు బానిసయ్యాడు. గంజాయికి అలవాటు పడి మత్తులో మునిగితేలుతూ ఉండేవాడు. గంజాయి కొనుక్కునేందుకు తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు. ఆమె ఇవ్వకపోయినా లాక్కుని వెళ్లేవాడు. కొడుకు ప్రవర్తన పట్ల రస్మిత తీవ్ర మనస్తాపం చెందింది. ఏదో ఒకరోజుకు మారతాడని ఆశించింది. కానీ.. ఆమె ఆశలు అడియాసలయ్యాయి.

ఇది కూడా చదవండి: Husband: భర్తకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసి ఈ భార్య ఏం చేసిందో చూడండి.. అతనికీ ఎలా తెలిసిందంటే..

ప్రశాంత్ మారకపోగా.. రోజురోజుకూ దిగజారి ప్రవర్తించేవాడు. ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య కూడా ఇతనిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి, తమ్ముడితో కలిసి ఉంటున్న ప్రశాంత్ బసంత్ ఇంట్లో లేని సమయంలో తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని తెగేసి చెప్పింది. అయినా.. డబ్బులు తీసుకెళ్లి గంజాయికి తగలేసి మత్తుకు బానిస కావొద్దని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని తల్లి హితవు పలికింది. తల్లి మాటలు ప్రశాంత్ జెనాకు రుచించలేదు. పైగా.. ఆమెతో డబ్బుల గురించి గొడవ పెట్టుకున్నాడు. ఈ విషయంలో తల్లీకొడుకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది.

ఇది కూడా చదవండి: HouseWife: పెళ్లై ఆరేళ్లు అవుతున్నా భర్తతో పిల్లలు కలగలేదని ఈమె ఓ నిర్ణయం తీసుకుంది.. కానీ ఏం సుఖం..

ఈ క్రమంలో.. గంజాయి మత్తులో బంధాల విలువ పూర్తిగా మర్చిపోయిన ప్రశాంత్ కన్న తల్లిని చంపేశాడు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కన్న పాపానికి తల్లినే సజీవ దహనం చేశాడు. వీళ్ల ఇల్లు కాస్త దూరంగా ఉండటంతో ఆమె అరుపులు, కేకలు కూడా ఎవరికీ వినిపించలేదు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవడంతో కొంతసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే.. మంటల ధాటికి ఇల్లు తగలబడిపోవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇది కూడా చదవండి: Family: భార్యాభర్తలు.. ఒక పాప.. బాబు.. ఇంత చక్కగా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు లేదు.. ఏమైందంటే..

ఇల్లు కాలిపోతున్న దృశ్యం చూసిన స్థానికులు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన బసంత్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇల్లు తగలబడిపోతుండటంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన బసంత్ ఇంట్లో ఉన్న తల్లి కోసం చూడగా కాలిపోయిన స్థితిలో తల్లి మృతదేహం కనిపించింది. ఆమెను అలా చూసిన బసంత్ కుప్పకూలిపోయాడు. అదేరోజు ఇంటికొచ్చిన ప్రశాంత్‌ను ఇల్లు ఎలా తగలబడిందని, అమ్మ ఎలా చనిపోయిందని బసంత్ అడగ్గా.. తానే అమ్మను తగలబెట్టి చంపేశానని ప్రశాంత్ చెప్పాడు. దీంతో.. అన్న సమాధానం విని బసంత్ షాకయ్యాడు. వెంటనే.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రశాంత్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనపై విచారణ జరిపి ఆమెను ప్రశాంత్ హత్య చేసినట్లు నిర్ధారించారు. కన్న తల్లిని పొట్టనపెట్టుకున్న ఈ కర్కోటక కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి మత్తులో పడి ఎన్నో కుటుంబాలు ఇలా చితికిపోతున్నాయి. ఎంతోమంది నేరాలకు పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు.

First published:

Tags: Bhuvaneshwar, Crime news, Odisha, Son kills his mother

ఉత్తమ కథలు