ప్రాణాల మీదకు తెచ్చిన సరదా...మెంతికూర అని చెప్పి...గంజాయి ఇచ్చారు..అంతలోనే...

తన బావమరిదిని ఆటపట్టించాలనుకొని... మెంతికూర పొడి అని చెప్పి... కూరలో కలిపి వండుకుని తినండి అని గంజాయిని ఇచ్చాడు. వారు తేడా తెలియక దాన్ని కూరలో వేసి వండేశారు. అయితే ఆ కూర‌ తిన్న కుటుంబ స‌భ్యులు.. ఒక్కొక్క‌రుగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు.

news18-telugu
Updated: July 1, 2020, 8:07 PM IST
ప్రాణాల మీదకు తెచ్చిన సరదా...మెంతికూర అని చెప్పి...గంజాయి ఇచ్చారు..అంతలోనే...
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఓ సరదా కాస్తా కుటుంబం మొత్తాన్ని ఆసుపత్రి పాలు చేసింది. ఇంటికి వచ్చిన బావమరిది ఆటపట్టిద్దామని చేసిన సరదా ఓ కుటుంబాన్ని అనారోగ్యం పాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో చోటచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం షాకింగ్ గా మారింది. కన్నౌజ్‌పరిధిలోని మియాగంజ్ గ్రామానికి చెందిన వ్యక్తి.. తన బావమరిదిని ఆటపట్టించాలనుకొని... మెంతికూర పొడి అని చెప్పి... కూరలో కలిపి వండుకుని తినండి అని గంజాయిని ఇచ్చాడు. వారు తేడా తెలియక దాన్ని కూరలో వేసి వండేశారు. అయితే ఆ కూర‌ తిన్న కుటుంబ స‌భ్యులు.. ఒక్కొక్క‌రుగా స్పృహ‌త‌ప్పి ప‌డిపోయారు. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు ఈ స‌మాచారాన్ని అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు బాధితుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం తో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కాగా పోలీసులు విచారించగా అసలు విషయం బయట వచ్చింది. దీంతో మెంతికూర అని చెప్పి గంజాయి ఇచ్చిన ఓం ప్రకాష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
First published: July 1, 2020, 8:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading