రెండేళ్ల కిందట రేప్, హత్య... కోర్టు ఇచ్చిన తీర్పు ఇదీ...

హత్యలు చెయ్యాలనుకునేవారు చట్టాలకు భయపడరు. హత్యలు చెయ్యని వాళ్లకు ఆ చట్టాలతో పని లేదు. చైనాలో జరిగిన ఆ అత్యాచార... హత్యోదంతాన్ని చూస్తే ఇలాగే అనిపిస్తుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 10:34 AM IST
రెండేళ్ల కిందట రేప్, హత్య... కోర్టు ఇచ్చిన తీర్పు ఇదీ...
ఇల్లినాయిస్‌లో జరిగిన దారుణం (Image : Reuters - Robert Chiarito)
  • Share this:
బ్రెంట్ క్రిస్టెన్సెన్... 29 ఏళ్లు... కోర్టు అతనికి పెరోల్‌లోని జీవిత ఖైదు విధించింది. కారణం అతను అత్యంత కిరాతకంగా ఝాంగ్‌ని హత్య చేశాడు. క్రిస్టెన్సెన్... ఇల్లినాయిస్ యూనివర్శిటీ మాజీ ఫిజిక్స్ పీహెచ్‌డీ విద్యార్థి. అక్కడకు అప్పుడప్పుడూ వచ్చేది 26 ఏళ్ల చైనా విద్యార్థిని యింగ్యింగ్ ఝాంగ్. 2017 జూన్‌లో... ఆమెను బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టి... కిడ్నాప్ చేసి... తన అపార్ట్‌మెంట్‌కి కారులో తీసుకెళ్లాడు. ఆమెను రేప్ చేసి... కత్తితో పొడిచి... హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత... శరీరాన్ని ముక్కలుగా కోసి... మూడు చెత్త సంచుల్లో ప్యాక్ చేశాడు. ఆ సంచుల్ని... ఇల్లినాయిస్‌లోని తన అపార్ట్‌మెంట్‌కి దగ్గర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ దగ్గర పడేశాడు.

పోలీసులు చెప్పిందేంటంటే... శవం ఉన్న సంచుల్ని పడేసిన చోట... చెత్తను తగలబెట్టేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఝాంగ్ శరీర భాగాలు కూడా తగలబడిపోయాయని అనుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఆమె డెడ్ బాడీ ఎముకలు కూడా దొరికే అవకాశం లేదంటున్నారు. ఝాంగ్‌ని హత్య చేసిన కొన్ని రోజుల తర్వాత... క్రిస్టెన్సేన్... ఆమె బట్టలు, బ్యాగ్, సెల్‌ఫోన్, బుక్స్, ఇతర వస్తువుల్ని ఓ పెద్ద సంచిలో పెట్టి... అర్బానా ఏరియాలోని వేర్వేరు చెత్త కుప్పల్లో పడేశాడు. నెల తర్వాత జులై 12, 2017న... సెల్‌ఫోన్‌తోపాటూ.... కొన్ని వస్తువులు పోలీసులకు దొరికాయి. వాటి ఆధారంగా దర్యాప్తు జరిపి... అతనే హంతకుడని కనిపెట్టారు.

తన కూతురి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసి... చివరి క్షణాల్లో ఆమెకు అత్యంత తీవ్రమైన నరకం చూపించిన ఇలాంటి దుర్మార్గుడికి జీవితాంతం జైల్లో నరకమే చూపించాలని కన్నీరు పెడుతూ కోర్టును కోరారు ఝాంగ్ తండ్రి రోంగావ్ ఝాంగ్.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు