Home /News /crime /

ILLEGAL TRADERS DEMANDING HIGH INTEREST RATES IN THE COAL BELT AREA POLICE DETAINED 10 MEMBERS DETAILS HERE MS KNR

అధిక వడ్డీలతో జనాల నడ్డి విరుస్తున్నారు... కోల్ బెల్ట్ ఏరియాలో జోరుగా వడ్డీల వ్యాపారం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోల్ బెల్ట్ ఏరియాలో అక్రమ వడ్డీ వ్యాపారులు జనాల నడ్డి విరుస్తున్నారు. ప్రజల అవసరాలకు ఆసరాగా చేసుకుని.. వారికి డబ్బులిచ్చి.. జలగల్లా వారి రక్తం తాగుతున్నారు. రూపాయి ఇచ్చి పది రూాపాయలు వసూలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇది ఆఏరియాలలో అధికారికంగా సాగుతున్నా.. దీనిపై అడిగేవారు లేరు.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  కోల్ బెల్ట్ ఏరియా..  అంటే పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని. ఒకప్పుడు ఉమ్మడి కరీంనర్ జిల్లాలో భాగమైన ఇవి.. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిధి కింద ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కావడంతో ఇక్కడ వ్యాపారాలు బాగానే గిట్టుబాటు అవుతాయి. ఇదే అదునుగా తీసుకుని పలువురు వడ్డీ వ్యాపారస్తులు.. అవసరార్థుల నడ్డి విరుస్తున్నారు. ఇక్కడ రోజురోజుకూ వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతి మించుతున్నాయి. చిన్న చిన్న కిరాణం, పండ్లు, కూరగాయల దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసేవారు.. వీళ్ల వడ్డీ దాహానికి బలవుతున్నారు. డబ్బులిచ్చినట్టే ఇచ్చి.. బకాసూరులుగా వారిమీద పడి దోచుకుతింటున్నారు. ఇక అత్యవసరాల నిమిత్తం ఎవరైనా వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బు తీసుకుంటే.. అంతే సంగతులు... ఇచ్చిన దాన్లో ఒక శాతం అయ్యగారికి అప్పగించాల్సిందే.

  వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకుంటే వారి అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు అవరార్థులను నిండా ముంచుతున్నారు. వేయి రూపాయలకు రోజుకు వంద రూపాయలు, రూ. 10,000 కు రోజుకు రూ. 200 ఇంకా అత్యవసర పరిస్థితి ఉంటే లక్షకు రోజు వేయి నుంచి రూ. 2,000 దాకా వసూలు చేస్తున్నారు. అధిక వడ్డీ కి ఇస్తూ సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తున్నారు.ఇదేగాక ‘గిరిగిరి ఫైనాన్స్’ అంటే.. ఈరోజు రూ. 1,00,000 తీసుకుంటే.. అందులోంచి రూ. 10,000 కట్ చేసుకొని రూ. 90,000 ఇస్తారు. వీటిని తిరిగి 100 రోజులలో రోజుకు 1,000 రూపాయల చొప్పున మళ్ళీ లక్ష రూపాయలు వసూలు చేస్తారు. ఒకవేళ అలా కట్టని యెడల తిరిగి ఇంతకు ముందు వడ్డీ.. అసలు కలిపి మళ్ళీ కొత్తగా ఇవ్వాలి. ఇలా మోసం చేస్తూ లక్షల్లో లాభాలను పొందుతూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారు.

  గతంలో అరెస్టు చేసినా... 

  గతంలోకూడా అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న 78 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రు. 65.52 లక్షలు, ప్రాంసరి నోట్స్-1235, బ్లాంక్ చెక్ లు -1019, ATM కార్డ్స్-347, బాండ్ పేపర్స్-175, ల్యాండ్ పేపర్స్-23, పట్టా పాస్ బుక్స్-9 స్వాధీనం చేసుకున్నా వారిలో మార్పు రాలేదు. దీంతో పక్కా సమాచారం తో పోలీసులు ఆదివారం 10 మందిని అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. అమాయక ప్రజలకు డబ్బులు ఎరగా వేసి బారు వడ్డీ.. చక్ర వడ్డీలు వసూలు చేసినట్టు వారు చెప్పారు. ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించకుంటే నానా హింసలకు గురి చేసి ఇబ్బందులు పెడుతున్నట్టు ఒప్పుకున్నారు.

  భారీగా సొమ్ము స్వాధీనం..

  అర్టెస్ట్ అయిన పది మంది నుండి సుమారు రూ. 12,00,000 లక్షల రూపాయల నగదు,.. బ్లాంక్ చెక్కులు..  బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ (సంతకాలతో కూడినవి), పాసుబుక్స్.. ఎటిఎం కార్డ్స్.. కస్టమర్స్ లోన్ ఫైన్స్..  డైలీ రిజిస్టర్, ఇంకా బ్యాంకు స్టేట్మెంట్ ఫైల్స్, రిసీప్ట్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.

  ఇలా గతంలో కూడా చాలా వరకు నమోదు చేయబడిన 45 కేసులలో 78 మంది నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో కొంతమంది గతంలో అక్రమ ఫైనాన్సు కేసులలో అరెస్టై.. మళ్లీ ఈసారి పట్టుబడ్డారు. వీరిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. మిగిలిన వారిపై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.

  ఈ ముఠా వెనుక ఎవరెవరున్నారు..? ఎంత మొత్తంలో డబ్బులు పెట్టారు..? ఎవరెఎవరితో సంబంధాలున్నాయి..? వీరికి డబ్బు ఎలా వస్తుంది...? అని పలు సాక్ష్యాల సేకరణ సేకరిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన సరైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని పలువురు సూచిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు పోలీస్ వారికీ తెలియచేయాలని కోరుతున్నారు.
  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Godavarikhani, Karimnagar, Peddapalli, Ramagundam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు