Andhra Pradesh: ఏపీకి ఆగని అక్రమ మద్యం.. ఈ సారి సర్కారు వాహనంలోనే!

Andhra Pradesh: ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏపీకి అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. ఈ సారి ఏకంగా రైల్వే శాఖకు చెందిన వాహనంలో మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

news18-telugu
Updated: September 29, 2020, 2:23 PM IST
Andhra Pradesh: ఏపీకి ఆగని అక్రమ మద్యం.. ఈ సారి సర్కారు వాహనంలోనే!
నిందితులు, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చూపుతున్న పోలీసులు
  • Share this:
ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలంగాణ నుంచి ఏపీకి అక్రమ మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. కొందరు చిత్ర విచిత్ర ఆలోచనలతో రోజుకో కొత్త మర్గం ద్వారా మద్యాన్ని సరిహాద్దులు దాటిస్తూనే ఉన్నారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా, తెలంగాణలో తక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. చేపలు తరలించే వ్యాన్ లో, అంబులెన్స్‌లో, బియ్యం బస్తాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఒంటికి ప్లాస్టర్లు అంటించుకుని ఇలా అనేక రకాలుగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు అనేకం మనం చూశాం. ఇప్పుడు మరో కొత్త మార్గం ద్వారా మద్యాన్ని తరలిస్తూ కొందరు పట్టుబడ్డారు. ఈ సారి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే అక్రమార్కులు ఎంచుకున్నారు. కానీ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆ వాహనాన్ని కూడా పోలీసులు అనుమానంతో తనిఖీ చేయడంతో భారీగా మద్యం సీసాలు బయటపడ్డాయి.

వివరాల ప్రకారం.. సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన లారీ వెళ్తు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది. ఆ లారీలో ఉన్న రైల్వే స్క్రాప్ మెటీరియల్ కింద 63 ఖరీదైన మద్యం బాటిళ్లను దాచారు. ముగ్గురు రైల్వే టెక్నీషియన్లు ఇలా మద్యం సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశారు. అయితే వారి ప్లాన్ బెడిసికొట్టింది. కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వీరి బాగోతం బయటపడింది. తనిఖీల్లో రైల్వే స్క్రాప్ మెటీరియల్ కింద దాచి ఉంచిన 63 ఖరీదైన మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు రైల్వే టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు. హైవే ఎస్ఐ ఎం.వీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడు రోజుల క్రితం కంచికచర్ల పోలీసుల తనిఖీల్లో పాల వ్యాన్ లో మద్యం తరలిస్తూ కొందరు దొరికిపోయారు. దీంతో మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ మద్యం రవాణాకు వినియోగిస్తున్న పాల వ్యాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి సాగుతున్న అక్రమ మద్యం రవాణా పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమార్కులు రోజుకో కొత్త రూపాన్ని ఎంచుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంత నిఘా ఉంచినా ఏదో విదంగా కొందరు మద్యం సరఫరా చేస్తూ పట్టుబడుతునే ఉన్నారు. పట్టుబడుతున్న మద్యమే ఇంత ఉంటే.. అధికారుల కల్లుగప్పి భారీగానే తరలుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Published by: Nikhil Kumar S
First published: September 29, 2020, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading