హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: రోజుకో కొత్త ప్లాన్.. పోలీసులకే షాక్ ఇస్తున్న వైనం!

Andhra Pradesh: రోజుకో కొత్త ప్లాన్.. పోలీసులకే షాక్ ఇస్తున్న వైనం!

రోజుకో విధంగా సాగుతున్న 
అక్రమ మద్యం రవాణా

రోజుకో విధంగా సాగుతున్న అక్రమ మద్యం రవాణా

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా పోలీసులే ఆశ్చర్యపడేలా సాగుతోంది. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు.

  తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా పోలీసులే ఆశ్చర్యపడేలా సాగుతోంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణలో తక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఏదో విధంగా అక్రమ మద్యం సరఫరా మాత్రం సాగుతూనే ఉంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఇప్పటికే అనేక బయటపడ్డాయి.

  చేపలు తరలించే వ్యాన్ లో, అంబులెన్స్‌లో, బియ్యం బస్తాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఒంటికి ప్లాస్టర్లు అంటించుకుని మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఘటనలు అనేకం మనం చూశాం. ఇప్పుడు మరో కొత్త మార్గం ద్వారా మద్యాన్ని తరలిస్తూ కొందరు పట్టుబడ్డారు. కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసుల తనిఖీల్లో ఈ కొత్త బాగోతం బయటపడింది. ఈ సారి పాల వ్యాన్ లో మద్యం తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ మద్యం రవాణాకు వినియోగిస్తున్న పాల వ్యాన్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  తెలంగాణ నుంచి ఏపీకి సాగుతున్న అక్రమ మద్యం రవాణా పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎన్ని చర్యలు తీసుకున్నా అక్రమార్కులు రోజుకో కొత్త రూపాన్ని ఎంచుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎంత నిఘా ఉంచినా ఏదో విదంగా కొందరు మద్యం సరఫరా చేస్తూ పట్టుబడుతునే ఉన్నారు. పట్టుబడుతున్న మద్యమే ఇంత ఉంటే.. అధికారుల కల్లుగప్పి భారీగానే తరలుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Wine shops

  ఉత్తమ కథలు