గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ

గోపీనాథ్ (file)

భార్య, ఇద్దరు కొడుకులున్న రంగనాథ్‌ తన దూరపు బంధువైన రాజేశ్వరిపై విపరీతంగా పెంచుకున్న వ్యామోహం చివరకు వారిని అనాథలుగా మార్చింది.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

  మోజుపడిన ప్రియురాలి పట్ల అతను పెంచుకున్న అపరిమితమైన వ్యామోహం చివరకు అతన్నే అంతమొందించింది. తనకు, భార్యకు మధ్య ఓ వ్యక్తి ఉన్నాడన్న కసితో, కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తి ఎలాగైనా అతణ్ని తప్పించాలని వ్యూహం పన్నాడు. ప్రియురాలి భర్త వేసిన స్కెచ్‌లో ప్రియుడు ప్రాణాలను కోల్పోగా.. ప్రియురాలు, ఆమె భర్త జైలు పాలయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కోదాడ సమీపంలోని అనంతగిరి గుట్టల్లో ప్రాణాలు కోల్పోయిన గ్రానైట్‌ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌ కథ ఇది. నిజానికి అతనో సక్సెస్‌ఫుల్‌ వ్యాపారస్తుడు. ఎక్కడో తమిళనాడు నుంచి బ్లాక్‌ గ్రానైట్‌కు చిరునామాగా ఉన్న ఖమ్మానికి మూడున్నర దశబ్దాల క్రితం వచ్చిన రంగనాథ్‌ చుట్టుపక్కల అనేక క్వారీలను సొంతం చేసుకున్నాడు. ఆర్థికంగా బాగానే పుంజుకున్నాడు. ఖమ్మం నగరంలో స్థితిమంతుల కాలనీగా పేరున్న వీడీవోస్‌ కాలనీలో భార్య, ఇద్దరు కుమారులతో కలసి నివాసం ఉంటున్నాడు. మంచిపేరు కూడా సంపాదించాడు. అతనికున్న చిన్న బలహీనత చివరకు ప్రాణాలమీదకు తెచ్చింది.

  Roja Birthday: రోజా బర్త్ డేకి జగన్ గిఫ్ట్... ఆశీస్సులతో పాటు ఓ చిరుకానుక


  ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే... జగన్‌కు దగ్గరగా ఉండే ఇద్దరు నేతల మధ్య ఫైట్


  Breaking News: ఆరుగురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్


  రంగనాథ్‌కు దూరపు బంధువైన చల్ల రాజేశ్వరితో కొన్నేళ్లుగా సాన్నిహిత్యం ఉంది. ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ సంబంధం వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. రాజేశ్వరి భర్త రమేష్‌ అలియాస్‌ ఖన్నా ఓ క్వారీలో మేస్త్రీగా పనిచేస్తాడు. బంధువైన రంగనాథ్‌కు తన భార్యతో ఉన్న సంబంధం తెలియడంతోనే కొద్ది కాలంగా ఖన్నా రగిలిపోతున్నాడు. రెండు వారాల క్రితం ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె నేలకొండపల్లి మండలం కొత్తూరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా రంగనాథ్‌తో సాన్నిహిత్యం మాత్రం నడుస్తునే ఉంది. వీరిద్దరూ తరచూ కలవడానికి వీలుగా ఆమె నిత్యం ఖమ్మం వస్తూ .. రావిచెట్టు బజారులోని ఓ టైలరింగ్‌ షాపులో శిక్షణ నిమిత్తం చేరింది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి భర్త ఖన్నా ఆమెను కలుసుకున్నాడు. బయటివ్యక్తి గురించి భార్యభర్తలమైన మనం విడిగా ఉండడమేంటని.. రంగనాథ్‌ను అడ్డు తొలగించుకుంటే మనం కలసి ఉండవచ్చంటూ తన ప్లాన్‌ను వివరించాడు. ఆమె కూడా సహకరిస్తానని చెప్పింది. అయితే అతన్ని నిర్జన ప్రదేశానికి తీసుకురావాలని సూచించాడు.

  Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు 

  SMSతో కరోనా దూరం.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రచారం


  అలవాటుగా రంగనాథ్‌ ఆదివారం మద్యాహ్నం రాజేశ్వరికి ఫోన్‌ చేశాడు. రాత్రికి వచ్చి తాను పికప్‌ చేసుకుంటానని, ఇద్దరం కలసి బయటకు వెళ్దామని చెప్పాడు. అప్పటికే తన భర్త పన్నిన వ్యూహం ప్రకారం అతనితో చాలా మాట్లాడేది ఉందని, దూరం వెళ్దామని కోరడంతో సరేనన్న రంగనాథ్‌ ఆమెను సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని శాంతినగరం శివారుల్లోని బండరాళ్ల గుట్టల్లోకి తీసుకెళ్లింది. బండలపై పచార్లు చేస్తూ మాట్లాడుతూ ఉండగానే.. అప్పటికే ఆ ప్రదేశంలో పొంచి ఉన్న రాజేశ్వరి భర్త ఖన్నా పెద్ద కర్రతో రంగనాథ్ తలపై బలంగా మోదాడు. ప్రమాదం పసిగట్టి పారిపోతున్న రంగనాథ్‌పై బండరాళ్లు విసిరేశాడు. కిందపడిన రంగనాథ్‌పై ఖన్నా బండరాళ్లతో దాడి చేశాడు. కసితీరా మొహంపై కొట్టాడు. రంగనాథ్‌ చనిపోయాడని నిర్ధరణ అయ్యాక ఖన్నా, అతని భార్య రాజేశ్వరి పారిపోయారు.

  కేటీఆర్‌కు ‘దొరికిపోయిన’ బీజేపీ.. బండి సంజయ్‌పై బీభత్సంగా ట్రోలింగ్

  సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్ 

  ఒకవేళ మళ్లీ తనపైన అనుమానం వస్తుందేమోనన్న ఆలోచనతో తానే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజేశ్వరి. ఆదివారం రాత్రి తాము ఇరువురం అక్కడ ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడిచేశారని, కాళ్లావేళ్లాపడ్డా వినకుండా రంగనాథ్‌ను బండరాళ్లతో కొట్లి చంపారని పోలీసులకు చెప్పింది. వ్యాపార గొడవల్లో కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు అతన్ని చంపి ఉంటారని నమ్మబలికింది. అయితే ఆమె వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో, తాను తన భర్త రమేష్‌ అలియాస్‌ ఖన్నాలు కలసి రంగనాథ్‌ను అంతం చేశామని అంగీకరించింది.

  3 నిమిషాల్లో 30 మ్యాజిక్స్... చూస్త్రే థ్రిల్ అయిపోతారు.. అందుకే గిన్నిస్ రికార్డు

  అమెరికాలో బయటపడిన వింత వస్తువు... గ్రహాంతరవాసుల పనేనా?

  భార్య, ఇద్దరు కొడుకులున్న రంగనాథ్‌ తన దూరపు బంధువైన రాజేశ్వరిపై విపరీతంగా పెంచుకున్న వ్యామోహం చివరకు వారిని అనాథలుగా మార్చింది. కష్టపడి పనిచేసే తన భర్త ఉండగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నెరపిన రాజేశ్వరి, చివరకు భర్తతో సహా జైలు పాలైంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: