Home /News /crime /

ILLEGAL AFFAIR WIFE ARRESTED FOR TRYING TO MURDER HUSBAND WITH HER LOVER IN TAMILANADU VB

Illict Affair: ఇష్టం లేని పెళ్లి.. మూడు నెలల కాపురం.. ప్రియుడితో కలిసి ఆమె ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Illict Affair: తనకు ఇష్టం లేకపోయినా తల్లి చూపించిన వ్యక్తిని ఆమె వివాహం చేసుకొని కాపురానికి అత్తారింటింకి వెళ్లింది. మూడు నెలలు కాపురం చేసిన తర్వాత తిరిగి పుట్టింటికి వెళ్లింది. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. భార్యను తీసుకెళ్లాడికి వచ్చిన అతడిపై భార్య, ఆమె ప్రియుడు కలిసి కత్తితో పొడిచి చంపేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  ఆమెకు 16 ఏళ్లు. తల్లి బలవంతంతో 18 ఏళ్లు నిండకుండానే ఆమెకు పెళ్లి చేసింది. భర్తతో ఇష్టం లేకపోయినా కష్టంగా మూడు నెలలు కాపురం చేసింది. ఆ తర్వాత భర్తతో కావాలనే ప్రతీ రోజు గొడవ పడుతూ ఉండేది. ఓ రోజు ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది. ఆమె అంతక ముందే ఓ యువకుడితో ప్రేమలో ఉంది.. అతడితో ఇంట్లో  నుంచి సంవత్సరం క్రితం పారిపోగా ఆమె తల్లి, బంధువుల కలిసి వెతికి పట్టుకొని వచ్చారు. ఇంట్లో వాళ్లు అతడిని మర్చిపోవాలని ఆమెను చాలాసార్లు మందలించారు. భర్తతో గొడవ పెట్టుకొని వచ్చిన ఆ మహిళ ప్రయుడితో ప్రేమాయాణం సాగించింది. భార్యను ఎలాగైనా కాపురానికి పిలుచుకుని వెళ్లాలని భర్త ఆమె ఇంటికి వెళ్లాడు. నా భార్యను పంపించండి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటూ భార్య అతని అత్తను వేడుకున్నాడు. పంచాయితీలు జరుగుతున్న సమయంలో ఓ రోజు తన భార్య, ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.

  చెన్నై సిటిలోని ఎన్నోర్ అపార్ట్ మెంట్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జ్యోతి అనే మహిళ అదే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కథలంపట్టి గ్రామానికి చెందిన కరుప్పస్వామి (30) అనే యువకుడు చెన్నై చేరుకుని జ్యోతి పని చేస్తున్న రెస్టారెంట్ లోనే ఉద్యోగంలో చేరాడు. ఒకేచోట ఉద్యోగాలు చేస్తున్న జ్యోతి, కరుప్పస్వామి స్నేహితులు అయ్యారు. స్నేహం కాస్త వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునే తీరులో మారిపోయింది. అయితే జ్యోతికి ఒక కూతురు ఉంది. తల్లితో రెస్టారెంట్ కు వస్తున్న కూతురును చూసి కురుప్పస్వామి మనసు పడ్డాడు. ఆంటో మీ కూతురును పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నా కూతురికి 16 సంవత్సరాలు అని జ్యోతి చెప్పడంతో పర్వాలేదు నేను పెళ్లి చేసుకుంటానని కరుప్పస్వామి ఆమెకు చెప్పాడు. పెళ్లి కట్నం తీసుకోకుండానే తన కూతురిని పెళ్లి చేసుకోవడానికి కరుప్పస్వామి సిద్దం కావడంతో జ్యోతి కూడా సరే అని చెప్పింది. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని జ్యోతికి ఆమె కూతురు చెప్పింది.

  ఇష్టం లేకపోయినా తల్లి జ్యోతి బలవంతంగా కరుప్పస్వామితో మూడు నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఆమె కూతురి వివాహం సింపుల్ గా జరిపించేసింది. మూడు నెలలు కాపురం చేసిన తర్వాత ఆమె భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చింది.
  తన భార్యను ఎలాగైనా కాపురానికి పిలుచుకుని వెళ్లాలని కరుప్పస్వామి ఆమె ఇంటికి వెళ్లాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగా ఓ రోజు తన భార్య, ప్రేమికుడు కలిసి ప్లాన్ చేసి అతడిని కత్తితో పొడిచి చంపేశారు. వెంటనే కరుప్పస్వామిని చెన్నైలోని స్టాల్నీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన ఎన్నోర్ పోలీసులు కరుప్పస్వామి భార్య, ఆమె ప్రియుడు వసంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 10వ తరగతి చదువుతున్న సమయంలోనే వసంత్ కుమార్, జ్యోతి కూతురు ప్రేమించుకున్నారని, ఇంటి నుంచి పారిపోయి మూడు నెలలు కాపురం చేశారని, తరువాత జ్యోతి ఆమె కూతురిని పట్టుకుని ఇంటికి పిలుచుకుని వచ్చిందని ఎన్నోర్ పోలీసులు అన్నారు.

  పెళ్లి చేసుకున్న తరువాత కూడా జ్యోతి కూతురు వసంత్ కుమార్ తో అక్రమ సంబంధం సాగించిందని, ఎలాగైనా భర్త కరుప్పస్వామిని చంపేసి ప్రియుడు వసంత్ కుమార్ తో కలిసి ఉండాలని స్కేచ్ వేసిందని విచారణలో అంగీకరించిందని పోలీసులు అన్నారు. కరుప్పస్వామిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన అతని మైనర్ భార్యను, ఆమె ప్రియుడు వసంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసుతో పాటు మైనర్ కు పెళ్లి చేశారని జ్యోతి మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Illicit affair, Wife and husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు