HOME »NEWS »CRIME »illegal affair leads to wife murder in the hands of lover in visakhapatnam hsn

డ్యూటీకి వెళ్లిన భర్త.. అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన భార్య ప్రియుడు.. తెల్లారేసరికి జరిగిన ఘోరమిది..!

డ్యూటీకి వెళ్లిన భర్త.. అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన భార్య ప్రియుడు.. తెల్లారేసరికి జరిగిన ఘోరమిది..!
ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడు, భార్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్న విషయం ఎలాగో భర్తకు తెలిసింది. ఈ క్రమంలోనే దుర్గాప్రసాద్ రెండ్రోజుల క్రితం డ్యూటీకి వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఆ యవకుడు రమాదేవి ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత..

  • Share this:
    బంగారంలాగా చూసుకునే భర్త, ఓ కొడుకు, ఓ కూతురు. ఏ చీకూచింతా లేని కుటుంబం మధ్య భార్య వివాహేతర సంబంధం చిచ్చురేపింది. అది కాస్తా కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది. చివరకు భార్య మరణానికి దారి తీసింది. విశాఖ పట్టణం జిల్లాలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణం జిల్లా కోటవురట్ల మండలం, కైలాసపట్నంకు చెందిన 26 ఏళ్ల పేరూరి రమాదేవికి ఎనిమిదేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన దుర్గా ప్రసాద్ తో పెళ్లయింది. భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవల విశాఖలోని యండపల్లిలో ఉంటున్న తాతయ్య ఇంటికి భర్త, పిల్లలతో కలిసి వచ్చి, అక్కడే నివాసముంటున్నారు. భర్త లారీ క్లీనర్. వెళ్లిన ప్రతీసారి పది, పదిహేను రోజులకు ఓసారి ఇంటికి వచ్చేవాడు. అదే సమయంలో భార్యకు నర్సీపట్నంలో హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు పరిచయం అయ్యాడు.

    వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్న విషయం ఎలాగో భర్తకు తెలిసింది. దీంతో పద్దతి మార్చుకోవాలని భార్యకు ఆ భర్త హితవు పలికాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త డ్యూటీకి వెళ్లగానే రోజూ రాత్రిళ్లు ఆ యువకుడు ఆమె ఉంటున్న ఇంటికి వచ్చేవాడని పిల్లలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దుర్గాప్రసాద్ రెండ్రోజుల క్రితం డ్యూటీకి వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఆ యవకుడు రమాదేవి ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఏమయిందో ఏమో, తెల్లారుజామున ఆమె హతమయి ఉండటాన్ని చూసి పిల్లలు భయపడిపోయి పక్కింటి వాళ్లకు చెప్పారు. దీంతో వాళ్లు భర్త దుర్గాప్రసాద్ కు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న దుర్గా ప్రసాద్ శనివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు.



    అర్ధరాత్రి తర్వాత ఆ ఇంటికి వచ్చిన యువకుడే రమాదేవిని చంపి ఉంటాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆమె హత్య గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని నర్సీపట్నం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఎవరు.? ఎందుకు హత్య చేశాడన్నది త్వరలోనే తేల్చుతామని పోలీసులు వెల్లడించారు. కాగా, భర్త చెప్పిన మాటలతో తన పద్దతి మార్చుకునేందుకు, వివాహేతర సంబంధాన్ని ఆపేందుకు ఆమె యత్నించడంతోనే ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు చెప్పుకుంటున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 24, 2021, 06:33 IST

    टॉप स्टोरीज