B.Tech Student: చదువుకొమ్మని తల్లిదండ్రులు కాలేజీకి పింపిస్తే.. అతడు చేసిన నిర్వాకం ఇది.. టీచర్లను కూడా వదలకుండా..

ప్రతీకాత్మక చిత్రం

Fifty Students: అతడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. కొన్ని యాప్స్ లను ఉపయోగించి ఫొటోలను మార్ఫింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. అమ్మాయిలు, టీచ‌ర్ల ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ చివరికి కటకటాల్లోకి వెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  పాట్నాకు చెందిన మహావీర్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను నార్త్ ఢిల్లీలోని ఓ స్కూల్‌కు చెందిన 50 మంది విద్యార్థినుల‌ను, టీచ‌ర్ల‌ను వేధింపులకు గురి చేశాడు. దిల్లీలోని ఓ ప్రముఖ పాఠాశాలలోని బాలికలు, ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని యాప్స్‌పై తనకున్న పరిజ్ఞానంతో ఫొటోలను మార్ఫింగ్‌ చేయడం మొదలెట్టాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వాయిస్‌ ఛేంజింగ్‌ యాప్‌ ఉపయోగించి మాట్లాడేవాడు. వీరిని వేధించే క్రమంలో వారితో పరిచయం పెంచుకోవడానికి మహావీర్ నకిలీ కాలర్ ఐడి , వర్చువల్ నంబర్లు వాడి వాట్సప్‌లో వారితో పరిచయం పెంచుకునేవాడు. అమ్మాయిలు తనకు క్లోజ్‌ అయ్యారని తెలిశాక ఫొటోలను అడిగి వాటిని మార్ఫింగ్‌ చేసి వారి పేర్లతో ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి అందులో అప్‌లోడ్‌ చేసేవాడు.

  ఆమె నిద్రలేచి చూసే సరికి తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయం తెలియలేదు.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..


  అలా చాలా ఫొటోలు సోషల్ మీడియా వేదికల్లో కనిపించడంతో ఆ స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వివరాలు బయటకు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. వేరువేరు ఇంట‌ర్నేష‌న‌ల్ నెంబ‌ర్స్ నుంచి టీచ‌ర్ల‌కు, బాలికలకు ఫోన్ కాల్ చేసి వేధించిన‌ట్లు తెలిసింది. విచారణంలో మైనర్ బాలికలను గుర్తించి, వారికి వాట్సాప్‌లో మెసేజ్ లు పెట్టేవారు. ఇక టీచర్లను మరో రకంగా వేధించేవాడు. వారికి అంతర్జాతీయ నంబర్లనుంచి ఫోన్ లు, వాట్సాప్ మెసేజ్ లు చేసేవాడు.

  ఆన్‌లైన్ క్లాసుల కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లోకి చొర‌బ‌డి ఆ ఐఐటీ విద్యార్థి వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు బాధితులు ఆరోపించారు. వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేక్‌మెయిల్‌ ఐడీకి వాడిన ఐపీ లాగిన్‌ వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేయగా అవి బిహార్‌లోని పాట్నాకు చెందిన మహవీర్‌వని తేలింది. పోక్సో చ‌ట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా పోలీసులు.. స్కూల్ విద్యార్థులు, టీచ‌ర్లు, తల్లిదండ్రులను కూడా విచారించారు. నిందితుడికి చెందిన పలు వాట్సాప్ వ‌ర్చువ‌ల్ నెంబ‌ర్లు, ఇన్‌స్టా ప్రొఫైల్స్‌, ఫేక్ కాల‌ర్ ఐడీ యాప్‌ల‌ను గుర్తించి.. అతడివద్ద ఉన్న వాటిని సీజ్ చేశారు. మొదట ఓ విద్యార్థినితో పరిచయం ఏర్పరుచుకున్న మహవీర్‌.. ఆ త‌ర్వాత బాలిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె ఫ్రెండ్స్‌తో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఐఐటీ విద్యార్థి కావడంతో పాటు యాప్ టెక్నాల‌జీలో మంచి నాలెడ్జ్ ఉండడంతో అతనికి విద్యార్థులను, మహిళలను వేధించడం సులువైంది.

  Hyderabad Crime: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. అత్యంత దారుణంగా..


  ఇందులో కొందరు మైన‌ర్ బాలిక‌ల‌ను కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు 33 వాట్సాప్ వర్చువల్ నెంబర్లు, ఐదు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లు, నకిలీ కాలర్ ఐడి యాప్‌లను ఉపయోగించి చేసిన అనేక కాల్‌లను గుర్తించగలిగామని పోలీసు అధికారులు తెలిపారు. తమ బృందం సామాజిక మాధ్యమ ఖాతాలను తనిఖీ చేసి వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మరియు నకిలీ మెయిల్ ఐడి యొక్క ఐపి లాగ్‌ల వివరాలను విశ్లేషించిందని.. నిందితుడు మహావీర్‌గా గుర్తించబడ్డాడని.. కల్సి చెప్పారు.

  Sexual Harassment: అక్క కోసం వెళ్లాడు.. చెల్లితో అతడు ఏం పని చేశాడో చూడండి..


  మొబైల్ నంబర్లను విశ్లేషిస్తున్నప్పుడు.. నిందితుడు మూడేళ్ల క్రితం బాధితులలో ఒకరిని సంప్రదించాడని, అప్పటి నుండి ఆమెను వెంటాడి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇతడు బీటెక్ చుదువుతున్న క్రమంలోనే.. మొదట పాఠశాల విద్యార్థులలో ఒకరితో పరిచయం ఏర్పడింది. దాంతో Instagram మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆమె స్నేహితులను సంప్రదించడం ప్రారంభించాడు. అతనికి యాప్‌లపై మంచి పరిజ్ఞానం ఉండటంతో అతను దానిని ఉపయోగించాని డిసిపి చెప్పారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో అనేక అసభ్యకర వీడియోలు మరియు ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయని.. అతని ఫోన్ మరియు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
  Published by:Veera Babu
  First published: