ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ పేరుతో మోసం... అడ్డంగా బుక్కైన ఐఐటీ గ్రాడ్యుయేట్

రెండు కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్టు నమ్మించి 15 లక్షల మంది డేటా సేకరించాడు ఈ కేటుగాడు.

news18-telugu
Updated: June 3, 2019, 2:12 PM IST
ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ పేరుతో మోసం... అడ్డంగా బుక్కైన ఐఐటీ గ్రాడ్యుయేట్
ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ పేరుతో మోసం... అడ్డంగా బుక్కైన ఐఐటీ గ్రాడ్యుయేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అతనో ఐఐటీ గ్రాడ్యుయేట్. బుద్ధిగా ఉద్యోగం చేసుకోకుండా కాసులకు కక్కుర్తిపడ్డాడు. లక్షలాది మంది డేటా కొట్టేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. "ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పంపిణీ పథకం" ప్రారంభించాడు. రెండోసారి మోదీ ప్రధాని అయినందుకు ప్రభుత్వం రెండు కోట్ల మంది యువతకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందంటూ ప్రచారం చేశాడు. ఓ నకిలీ వెబ్‌సైట్ సృష్టించాడు. 'ప్రధాన మంత్రి ముఫ్త్ ల్యాప్‌ట్యాప్ వితరణ్ యోజన 2019' అని పథకానికి పేరు పెట్టి ప్రధాని మోదీ ఫోటోను, 'మేక్ ఇన్ ఇండియా' నినాదాన్ని వాడుకున్నాడు. ఈ మెసేజ్‌ను వాట్సప్‌లో వైరల్ చేశాడు. జస్ట్ రెండు రోజుల్లో 15 లక్షల మంది డేటా కొట్టేశాడు. కానీ కథ అడ్డం తిరిగింది. అడ్డంగా దొరికిపోయాడు. రెండు కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్టు నమ్మించి 15 లక్షల మంది డేటా సేకరించాడు ఈ కేటుగాడు.

Read this: Zomato Cricket Cup: క్రికెట్ మ్యాచ్‌ ఫలితాన్ని కరెక్ట్‌గా చెప్తే 100% క్యాష్‌బ్యాక్

వాస్తవానికి ఈ మోసంపై పోలీసులకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదు రాలేదు. ఆన్‌లైన్ యాక్టివిటీని పోలీసులు పరిశీలిస్తుండగా ఫ్రీ ల్యాప్‌టాప్ క్యాంపైన్ గురించి తెలిసింది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని రోజులుగా ఆ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ బాగా వస్తున్నట్టు తేలింది. ఇదేదో మోసంలా ఉందని అనుమానించిన ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా రాజస్తాన్‌లోని నాగౌర్ ప్రాంతం నుంచి వెబ్‌సైట్ ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుడైన రాకేష్‌ను అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తే ఐఐటీ గ్రాడ్యుయేట్ అని తేలింది. మేనేజ్‌మెంట్ అండ్ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాకేష్... త్వరలో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాల్సి ఉంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ప్రజల్ని నమ్మించేందుకు ఈ గెలుపు ఉపయోగపడుతుందని భావించిన రాకేష్... ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ పేరుతో గాలం వేశాడని తేలింది. వెబ్‌సైట్‌లో యూజర్ల పేర్లు, వయస్సు, ఫోన్ నెంబర్, రాష్ట్రం లాంటి వివరాలను సేకరించినట్టు తేలింది.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:

Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...Jobs: నవోదయ విద్యాలయ సమితిలో 370 టీచర్ ఉద్యోగాలు... వివరాలివే

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే
First published: June 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు