హోమ్ /వార్తలు /క్రైమ్ /

IRCTC: ఐఆర్సీటీసీ యాప్ కంటే వేగంగా టికెట్లు బుక్.. ఐఐటీ గ్రాడ్యూయేట్ అరెస్టు...!

IRCTC: ఐఆర్సీటీసీ యాప్ కంటే వేగంగా టికెట్లు బుక్.. ఐఐటీ గ్రాడ్యూయేట్ అరెస్టు...!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైలులో మనమెక్కడికైనా వెళ్లాలంటే ముందుగా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఐఆర్సీటీసీ. కానీ ఈ యువకుడు ఈ యాప్ కంటే మెరుపు వేగంతో పనిచేసే యాప్ ను రూపొందించాడు. కానీ అరెస్టయ్యాడు.. ఎందుకు..?

  • News18
  • Last Updated :

రైల్వే టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం ఐఆర్సీటీసీ. ఈ యాప్ నుంచే మనం టికెట్లను బుక్ చేసుకోగలం. కానీ ఒక ఐఐటీయన్ మాత్రం ఈ యాప్ కంటే వేగంగా టికెట్లు బుక్ అయ్యే యాప్ ను రూపొందించాడు. కానీ అరెస్టయ్యాడు. ఎందుకనుకుంటున్నారా..? అదే అతడు చేసిన మోసం. అది అధికారిక యాప్ కాదు. ఆ యువకుడు రూపొందించిన యాప్ ద్వారా ఐఆర్సీటీసీ కంటే వేగంగా టికెట్లు బుక్ చేయబడ్డా.. అది టికెట్ ఫ్రాడింగ్ కిందికే వస్తుంది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన ఐఐటీ గ్రాడ్యూయేట్ ఎస్. యువరాజ.. 2016 లో ఒక యాప్ రూపొందించాడు. దాని పేరు సూపర్ తత్కాల్, సూపర్ తత్కాల్ ప్రో. ఈ యాప్.. ఐఆర్సీటీసీ యాప్ కంటే వేగంగా రైల్వే టికెట్లను బుక్ చేస్తుంది. దీంతో ఈ యాప్ ఆనతికాలంలో ప్రాచుర్యం పొందింది. సుమారు దీనికి లక్ష మంది వినియోగదారులున్నారు. ఐఆర్సీటీసీ ద్వారా అయితే ఆన్లైన్ నగదు చెల్లింపులుంటాయి. కానీ యువరాజ రూపొందించిన సూపర్ తత్కాల్ లో.. కాయిన్ ఆధారిత చెల్లింపుల ద్వారా చెల్లింపులు చేసేలా ఏర్పాటుచేశాడు ఇది టికెటింగ్ ఫ్రాడింగ్ కిందికే వస్తుందని రైల్వే అధికారులు అంటున్నారు.

ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఆర్పీఎఫ్ సైబర్ సెల్ అధికారులు, తిరుపూర్ రైల్వే అధికారులు కలిసి ఈ కుంభకోణాన్ని వెలికితీశారు. మోసపూరిత మార్గాల ద్వారా డబ్బులు సంపాదించినందుకు గానూ యువరాజను ఈనెల 23న అరెస్టు చేశారు.

నిందితుడు అన్నా విశ్వావిద్యాలయంలో బిఇ(ఏరోనాటికల్), ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ (ఏరోస్పేస్) చేసినట్టు తెలిపాడు. ఉన్నత చదువులు చదివినా.. ఇలాంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడటం బాధాకరమని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా విచారణ సమయంలో నిందితుడు తాను చేసిన మోసాన్ని ఒప్పుకున్నాడు. 2016 నుంచి 2020 దాకా ఈ యాప్ ద్వారా సుమారు రూ. 20 లక్షల దాకా మోసం చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ ఈ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాయి. రైల్వే చట్టంలోని సెక్షన్ 143(2) కింది యువరాజ పై కేసు నమోదైంది.

First published:

Tags: IIT, Irctc, South Central Railways, Tamilnadu, Train

ఉత్తమ కథలు