Home /News /crime /

IIT GRADUATE AHMAD MURTAZA ATTACKS ON GORAKHPUR TEMPLE SHOCKING THINGS COMING TO LIGHT PAH

Uttar pradesh: గోరఖ్ నాథ్ ఆలయ దాడి ఘటన కేసు: వెలుగులోకి వచ్చిన  షాకింగ్ విషయాలు..

దాడి చేస్తున్న వ్యక్తి

దాడి చేస్తున్న వ్యక్తి

Gorakhnath temple: యూపీలో గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల పోలీసులపై దాడికి పాల్పడిన అహ్మద్ ముర్తాజా అబ్బాసీని పోలీసులు అదుపులోనికి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

Ahmad murtaza attacks on Gorakhpur temple: యూపీలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఒక టైన గోరఖ్ నాథ్ ఆలయం వెలుపల ఆదివారం రాత్రి కత్తిపట్టుకుని అహ్మాద్ ముర్తాజా అబ్బాసీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇతను కత్తిపట్టుకుని మతపమైన నినాదాలు చేస్తు స్థానికులపై దాడికి తెగబడ్డాడు. దీంతో కొద్దిసేపు అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, స్థానికుల సహాయంతో చాకచక్యంగా వ్యవహారించి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై యూపీ హోంశాఖ సీరియస్ అయ్యింది.

పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. గోరఖ్ నాథ్ ఆలయంపై దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది. అతను.. ఉద్దేష పూర్వకంగానే దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా... ఇతని మొబైల్, ల్యాప్ టాప్ ల హిస్టరీని పోలీసులు పరిశీలించారు. అతను ఐసీస్ వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను కల్గిఉన్నాడని తెలింది. ఉగ్రవాదులకు సంబంధించిన పలు వీడియోలు చూసేవాడు.

అదే విధంగా, ఉగ్రవాదులు, దాడులకు చేసిన దాడులకు సంబంధించిన వీడియోల కోసం సెర్చ్ చేసేవాడని తెలింది. ఇతనికి ముంబై, నేపాల్ లో పలువురితో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఇది కాకుండా, ఈ కేసులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాసీ.. ఇస్లామిక్ స్టేట్‌కు విరాళాలు ఇస్తున్నాడని.. ఐఎస్‌ఐఎస్ కోసం సిరియాకు కూడా డబ్బులు పంపాడని.. అహ్మద్ ముర్తాజా చేసిన పలు లావాదేవీలు దొరికాయి.

అయితే, నిందితుడు అహ్మద్ ముర్తాజా తండ్రి మునీర్ ముర్తాజా అబ్బాసీ, తన కొడుకు ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని.. మానసిక పరిస్థితి బాగా లేదని పదే పదే చెబుతున్నాడు. ఈ క్రమంలో.. అహ్మద్ ముర్తజాను 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోరఖ్‌నాథ్ యూపీ లోని అత్యంత ప్రముఖ దేవాలయాలలో ఒకటి. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. అదే విధంగా, ఇటీవలే గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుండి తన మొదటి సారి రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh, Yogi adityanath

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు