Home /News /crime /

IISC REMOVES CEILING FANS FROM STUDENTS ROOMS TO CURB SUICIDES GH VB

Student Suicides: ఆత్మహత్యలు తగ్గాలంటే హాస్టల్ గదిలో వాటిని తొలగించాలని నిర్ణయం.. మండిపడుతున్న విద్యార్థులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏదైనా ఓ క్యాంపస్‌లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే దాని ఇన్‌స్టిట్యూట్‌ ఎలా స్పందించాలి? మానసికంగా బలంగా ఉండాలని, ఒత్తిళ్లకు లోనుకావద్దని విద్యార్థులకు సూచించాలి కదా! ఏ ఇన్‌స్టిట్యూట్‌ అయినా ఇలానే స్పందిస్తుంది. కానీ తాజాగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ బెంగళూరు) తన క్యాంపస్‌లో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడానికి ఒక తలతిక్క నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
ఏదైనా ఓ క్యాంపస్‌లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే దాని ఇన్‌స్టిట్యూట్‌ ఎలా స్పందించాలి? మానసికంగా బలంగా ఉండాలని, ఒత్తిళ్లకు లోనుకావద్దని విద్యార్థులకు సూచించాలి కదా! ఏ ఇన్‌స్టిట్యూట్‌ అయినా ఇలానే స్పందిస్తుంది. కానీ తాజాగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ బెంగళూరు) తన క్యాంపస్‌లో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడానికి ఒక తలతిక్క నిర్ణయం తీసుకుంది. క్యాంపస్‌లోని ప్రతి స్టూడెంట్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌లను తీసి వేయాల్సిందిగా ఇన్‌స్టిట్యూట్‌ ఆర్డర్ చేసింది. ఈ ఫ్యాన్‌లను గోడలకు అమర్చాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు, విద్యార్థులు టెర్రస్‌లు, ఇరుకైన బాల్కనీలలో తిరగకుండా ఇన్‌స్టిట్యూట్‌ కఠిన ఆంక్షలు విధించింది.

Shocking: పెళ్లి చేసుకున్నా ఆమెకు ఆ కోరిక మాత్రం పోలేదు.. చివరకు ఆమె ఎంతటి ఘనకార్యం చేసిందో చూడండి..


అయితే సీలింగ్ ఫ్యాన్‌లు లేకపోతే ఆత్మహత్యలు ఆగిపోతాయని ఐఐఎస్‌సీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఐఐఎస్‌సీ క్యాంపస్‌లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2020లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇలా ఆత్మహత్యలు జరుగుతుంటే.. విద్యార్థుల్లో మానసిక బలాన్ని పెంచాల్సిందిపోయి అసంబద్ధమైన చర్యలు చేపడుతోంది ఐఐఎస్‌సీ!

Zodiac Signs: వివాహం అయినా.. ఈ 3 రాశుల వారు తమ మాజీ ప్రేమికుల వంక చూస్తారట.. వారెవరంటే..


మానసిక ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థులను మానసిక నిపుణుల సహాయంతో గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలనే సోయి లేకుండా ఐఐఎస్‌సీ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

15 రోజుల్లో అన్ని ఫ్యాన్లు తొలగించాలని ఆదేశం..
ఐఐఎస్‌సీ యాజమాన్యం తన అంతర్గత లేఖలో రాబోయే 15 రోజుల్లో అన్ని గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లు తొలగించాల్సిందిగా సంబంధిత సిబ్బందిని ఆదేశించింది. సీలింగ్ ఫ్యాన్ తొలగింపు పని ఈ వారం యూ బ్లాక్ నుంచి ప్రారంభమైందని ఒక విద్యార్థి తెలిపాడు. ఈ చర్య పట్ల విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు యాజమాన్యం క్యాంపస్‌లో ఒక పోల్ కూడా నిర్వహించింది. అయితే ఐఐఎస్‌సీ హాస్టళ్లలోని సీలింగ్ ఫ్యాన్‌లను తీసేసి వాటిని వాల్‌కి అమర్చిన అంతమాత్రాన ఆత్మహత్యలకు కళ్లెం పడుతుందని తాము ఏమాత్రం భావించడం లేదని ఈ పోల్ లో పాల్గొన్న వారిలో 88 శాతం మంది విద్యార్థులు తేల్చి చెప్పారు.

Zodiac Signs: ఇంట్లో ఒక వ్యవహారం.. బయట మరో వ్యవహారం.. ఈ రాశుల వారు భాగస్వామిని నమ్మించి..


అలాగే, వారిలో 90 శాతం మంది ఈ రీప్లేస్‌మెంట్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. 6 శాతం మంది విద్యార్థులు మాత్రం ఈ మార్పుల గురించి తమకు అనవసరం అని పేర్కొన్నారు. వాస్తవానికి విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఐఐఎస్‌సీ సంస్థలో ఒక వెల్‌నెస్ సెంటర్ ఉంది. ఇది విద్యార్థులకు ఒత్తిడిని తట్టుకోవడానికి, మానసిక ఆరోగ్యానికి మెరుగుపరచడంలో దోహదపడుతుందని ఐఐఎస్‌సీ చెబుతోంది. కానీ దీని వల్ల ఒరిగేదేం లేదని ఇద్దరు విద్యార్థులు పేర్కొన్నారు.

అయితే ఈ వెల్‌నెస్ సెంటర్ ను మెరుగుపరచడానికి మెరుగైన ప్రణాళికలు రూపొందించిన్నట్లు యాజమాన్యం చెబుతోంది. కానీ, ఐఐఎస్‌సీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఆత్మహత్యల సంఖ్యను తగ్గించడానికి ఇలాంటి పరిష్కారాన్ని ఎంచుకోవడం సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Crime, Crime news, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు