హోమ్ /వార్తలు /క్రైమ్ /

Chor Village: మీ వస్తువు ఏదైనా పోయిందా.. ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉండొచ్చు..

Chor Village: మీ వస్తువు ఏదైనా పోయిందా.. ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉండొచ్చు..

Chor Village: ఆ ఊరు దొంగతనాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల వారంతా  చోర్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులు కూడా ముందుగా ఆ గ్రామానికే వెళ్తుంటారు.

Chor Village: ఆ ఊరు దొంగతనాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల వారంతా చోర్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులు కూడా ముందుగా ఆ గ్రామానికే వెళ్తుంటారు.

Chor Village: ఆ ఊరు దొంగతనాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల వారంతా చోర్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులు కూడా ముందుగా ఆ గ్రామానికే వెళ్తుంటారు.

    మీ వస్తువు ఏదైనా పోయిందా? జేబులో మొబైల్ గానీ.. ఇంట్లో బంగారం గానీ..  పశువులు గానీ కనిపించడం లేదా? ఐతే అది ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉంటుంది. అంతలా దొంగతనాలకు ఫేమస్ అయిపోయిందాా ఊరు. అది ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో ఉంది. దాని పేరు చిరోటి గ్రామం. ఈ ఊరు దొంగతనాలకు ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల వారంతా దానిని చోర్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులు కూడా ముందుగా ఆ గ్రామానికే వెళ్తుంటారు. తాజాగా అలాగే ఓ కేసును పరిష్కరించారు. మరి ఆ కేసు ఏంటి? పోలీసులు ఎలా పరిష్కరించారో ఇక్కడ తెలుసుకుందాం.

    Girl Identified: శానిటైజర్ తాగాను.. బై బై అంటూ అదృశ్యమైన బాలిక.. ఎక్కడ తేలిందంటే..?

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ముంగేలి జిల్లా లాల్‌పూర్‌లో జనవరి 31న చోరీ జరిగింది. ఓ వ్యక్తి నుంచి దాదాపు 40కిపైగా మేకలను గుర్తు తెలియని వ్యక్తులు అపహహరించారు. లాల్‌పూర్‌ సమీపంలోని ఓ గ్రామానిక చెందిన బాధితుడికి చాలా మేకలు ఉన్నాయి. మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల మేకలను అమ్మేందుకు పశువుల సంతకు వెళ్లాడు. అక్కడ కొందరు వ్యక్తులు అతడి దగ్గరకు వచ్చి... మేకలు కొంటామని చెప్పి బేరం ఆడారు. కానీ వారికి కొనే ఉద్దేశం లేదు. తక్కువ ధర చెప్పడంతో.. అంత రేటుకు తాను అమ్మేది లేదని ఆ వ్యక్తి తేల్చి చెప్పాడు. డీల్ కుదరకపోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరైన బేరం రాకపోవడంతో ఆ వ్యక్తి ఓ వాహనంలో తన మేకలను తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా చోరీ జరిగింది. రాత్రివేళ కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనాన్ని ఆపారు. కత్తితో వారిని బెదింరిచి మేకలతో ఉడాయించారు. ఈ ఘటనపై బాధితుడు లాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పఠారియా ప్రాంతంలోని చిరోటి గ్రామానికి చెందిన దొంగలే ఇలాంటి చోరీ చేస్తారని అనుమానించారు. ఓ బృందాన్ని ఆ గ్రామానికి పంపించి తనిఖీలు చేయించారు.

    Newly Married: వివాహం జరిగిన 22 రోజులకు ఊహించని ఘటన.. పెళ్లయితే చేసుకుంది కానీ..

    పోలీసులు అనుకున్నదే అయింది. చిరోటి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే మేకలను దొంగతనం చేశారు. వారి ఇళ్లల్లో 5 మేకలను గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నారు. మిగతా మేకలను బిలాయ్ తీసుకెళ్లి అమ్మేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి పికప్ వాహనంతో పాటు లక్షా 40వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, చిరోటి గ్రామం పట్ల స్థానికంగా చెడు అభిప్రాయముంది. ఎందుకంటే ఆ ఊరిలో చాలా మంది దొంగలున్నారు. చుట్టుపక్కల ఏమైనా వస్తువులు పోతే పోలీసులు ముందుగా అక్కడికే వెళ్తుంటారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.

    First published:

    Tags: Chhattisgarh, Crime news, Robbery

    ఉత్తమ కథలు