సమీర్ వాంఖేడే (Sameer Wankhede). గత కొద్దిరోజులుగా దేశంలో మారుమోగుతున్న పేరు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ (NCB Officer) సమీర్ వాంఖేడే. ఈ 40 ఏళ్ల వయస్సు ఉంటుంది. అయితేనేం అక్రమార్కుల భరతం పడుతున్నారు. అవినీతి, మాదకద్రవ్యాలపై సింగం (lion)లా పడి సీజ్ చేస్తున్నారు. ఈ అధికారే షారుఖ్ తనయుడ్ని ముంబైలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాడు. అయితే ఆయన బాలీవుడ్ (Bollywood)కు కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు ‘స్టార్స్ (stars)’కు ‘చుక్కలు’ చూపించాడు ఆఫీసర్ సమీర్ (Sameer)!. గతేడాది చనిపోయిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) కేసులో డ్రగ్స్ (drugs) మాఫియా కోణం కూడా ప్రచారంలోకి రావటంతో సమీర్ వాంఖేడే దానిపై దృష్టి పెట్టారు. రియా చక్రవర్తి (ria Chakravarthy) చుట్టూ ఉన్న కేసుల్ని ఆయన సీరియస్‌గా డీల్ (deal) చేశారు. ఈ తురణంలోనే డ్రగ్స్ మాఫియా ఆయన మీద దాడులు (attacks) కూడా చేసినట్లు తెలిసింది. 2020 నవంబర్ (November)లో ఆయన మీద, మరికొందరు ఎన్సీబీ అధికారుల మీద భౌతిక దాడి సైతం జరిగింది. ఆ సమయంలో సమీర్ వాంఖేడే గాయపడ్డారు
వెనక్కి తగ్గని సింగం..
దాడులు (attacks) జరిగినా ఎలాంటి పరిణామాలు ఎదురైనా వెనక్కి తగ్గని ‘సింగం’ అని ముంబైలో సమీర్ వాంఖేడేని అంటారు. అందుకు స్పష్టమైన తార్కాణం ఆయన రెండేళ్లలో పట్టుకున్న డ్రగ్స్ (drugs) విలువ (value) మొత్తంగా 17 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సెలబ్రిటీ (celebrities')లకు కూడా సమీర్ సెగ బాగా తగులుతూ ఉంటుంది. సినిమా వాళ్లతో నిత్యం వైరం కొనసాగించే సమీర్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య క్రాంతి రెడ్కర్... మరాఠీ, హిందీ సినిమాల్లో నటించిన పాపులర్ నటి (Actress).
2 వేల మందిపై కేసులు..
ఆయన కస్టమ్స్ ఆఫీసర్ (Customs officer)గా ఉన్నప్పుడు 2 వేల మంది ప్రముఖుల మీద కేసులు పెట్టారు. ఈ ఘటనే చెబుతోంది ఆయన ఊపు ఎలా ఉంటుందో! ఆయా సెలబ్రిటీలందరూ తగినంత డబ్బు (money) చెల్లించాకే విదేశాల నుంచీ తెచ్చిన తమ విలువైన వస్తువులు ఇళ్లకు తీసుకెళ్లారట. సమీర్ వాంఖేడే హిట్ లిస్ట్ (hit list)లో చాలా మంది బాంబే బాబులు ఉన్నప్పటికీ... మీకా సింగ్, అనురాగ్ కశ్యప్, వివేక్ ఒబెరాయ్... ఇలా కొంత మంది పేర్లు చెప్పుకుంటారు అక్కడి జనం. మన రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) ఆస్తులపై కూడా ఆ మధ్య ఈయన సోదాలు (search) చేసి కేసులు పెట్టించారట!
Read this also: డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న సంచలనాలు.. క్రూయిజ్ షిప్లో మరోసారి అధికారులు సోదాలు.. మరో ఎనిమిది మంది అరెస్టు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Drugs, Drugs case, Mumbai