Home /News /crime /

Supreme Court Case : భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రు విషం తాగితే.. భ‌ర్త‌ను శిక్షించ‌డం స‌రికాదు : సుప్రీం కోర్టు

Supreme Court Case : భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రు విషం తాగితే.. భ‌ర్త‌ను శిక్షించ‌డం స‌రికాదు : సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టు (ఫైల్)

సుప్రీంకోర్టు (ఫైల్)

భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. భార్య చ‌నిపోయింది.. అదృష్ట‌వ‌శాత్తు భ‌ర్త‌ బ‌య‌ట ప‌డ్డాడు.దీనిపై భ‌ర్త ప్రేరేపించ‌డం వ‌ల్లే భార్య ఆత్మ‌హ‌త్య(Suicide) చేసుకొంద‌ని హైకోర్టు(High Court) భ‌ర్త‌కు శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు (Supreme Court) ఏకీభవించలేదు.

ఇంకా చదవండి ...
    భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. భార్య చ‌నిపోయింది.. అదృష్ట‌వ‌శాత్తు భ‌ర్త‌ బ‌య‌ట ప‌డ్డాడు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. భ‌ర్త ప్రేరేపించ‌డం వ‌ల్లే భార్య ఆత్మ‌హ‌త్య(Suicide) చేసుకొంద‌ని హైకోర్టు భ‌ర్త‌కు శిక్ష విధించింది. దీన్ని స‌వాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లాడు భ‌ర్త‌. దీనిపై సుప్రీం కోర్టు(Supreme court) తీర్పునిచ్చింది. ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకొన్న‌ప్పుడు భ‌ర్త ప్రేరేపించ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య‌య‌త్నం జరిగింద‌న‌డం స‌రికాదంది. ఆత్మ‌హ‌త్య చేసుకోవడనికి గత్యంతరం లేని పరిస్థితులకు కల్పించినప్పుడే శిక్ష విధించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

    NEET 2021: ప్రాణం తీసిన భయం.. నీట్‌ ప‌రీక్ష‌ఫెయిల్ అవుతానని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌


    ఇక్క‌డ ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకొన్నార‌ని న్యాయ మూర్తులు ఎం.ఆర్‌.షా జ‌స్టిస్ అనిరుద్ధ్ బోస్‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది.
    అస‌లేం జ‌రిగింది..
    త‌మిళ‌నాడుకు చెందిన వెలుదురైకు వివాహం జ‌రిగి 25 ఏళ్లు గ‌డిచింది. వారికి ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఓ రోజు ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌ వాగ్వాదం జ‌రిగింది. అనంత‌రం ఇద్ద‌రూ పురుగుల మందు తాగారు. వారిని వెంట‌నే కుటుంబ స‌భ్యులు, స్థానికులు ఆస్ప‌త్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే దుర‌దృష్ట‌వశాత్తు భార్య మృతి చెందింది. భ‌ర్త బ‌తికాడు. అయితే భ‌ర్త‌పై సెక్ష‌న్ 306 కింద ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించ‌డు అనే కేసు న‌మోదు చేశారు. ఇందుకు స్థాయిన ట్ర‌య‌ల్ కోర్టు(Trial court) మూడేళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధించింది. హైకోర్టు ముందుకు ఈ కేసు రాగా హైకోర్టు కూడా ట్ర‌య‌ల్ కోర్టు తీర్పును స‌మ‌ర్థించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టు ఏకీభ‌వించ‌లేదు. భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన‌ట్టుగా భావించ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు పేర్కొంది. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జరిగిన‌ట్టుగా మాత్ర‌మే ఉంద‌ని, ఇత‌ర‌త్రా ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించ‌లేద‌ని పేర్కొంది. కావును భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించాడు అన‌డం స‌రికాద‌ని వ్యాఖ్య‌నించింది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు