ICICI Bank-Videocon Case: మనీలాండరింగ్ కేసులో చందా కొచ్చర్‌ భర్త అరెస్ట్‌

ICICI Bank-Videocon Case: ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్(Chanda Kochhar) భర్త , వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్(Deepak Kochhar) అరెస్టయ్యారు.

news18-telugu
Updated: September 8, 2020, 7:21 AM IST
ICICI Bank-Videocon Case: మనీలాండరింగ్ కేసులో చందా కొచ్చర్‌ భర్త అరెస్ట్‌
ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్(ఫైల్ ఫోటో)
  • Share this:
ICICI Bank-Videocon Loan Case: ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఆమె భర్త , వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్ అరెస్టయ్యారు. రుణాల మంజూరు వ్యవహారంలో నమోదైన మనీలాండరింగ్‌ కేసులో సోమవారం మధ్యాహ్నం నుంచి దీపక్ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమవ్వడంతో ఆయన్ను రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తమ విచారణకు కొచ్చర్ సహకరించడం లేదని, అందుకే అరెస్టు చేసి ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని యాంటి మనీలాండరింగ్ కోర్టులో నేడు(మంగళవారం) కొచ్చర్‌ను హాజరుపరుస్తామని తెలిపారు.

వీడియో కాన్‌ గ్రూప్‌నకు రూ.1875 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ దంపతులతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్‌ దూత్‌పైనా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో ఈడీ క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అవకతవకల కారణంగానే ఐసీఐసీఐ బ్యాంకు చందాకొచ్చర్‌ను సీఈవో పదవి నుంచి కూడా తప్పించింది. చందా కొచ్చర్‌ హయాంలో గుజరాత్‌లోని స్టెర్లింగ్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ, భూషణ్‌ స్టీల్‌ గ్రూప్‌కు రుణాలు మంజూరు చేయడంలోనూ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది.
Published by: Janardhan V
First published: September 8, 2020, 7:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading