కొంతమంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి.. ఆశిష్ గౌడ్ వ్యవహారంపై సంజన..

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరితే.. కనీసం ఫుటేజీని కూడా పరిశీలించలేదన్నారు. ఆశిష్ గౌడ్‌తో రాజీ చేసుకోవాలని కొంతమంది తెగ ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: December 5, 2019, 7:47 AM IST
కొంతమంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి.. ఆశిష్ గౌడ్ వ్యవహారంపై సంజన..
ఆశిష్ రెడ్డి, సంజన(File Photos)
  • Share this:
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పబ్బులో మద్యం మత్తులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్-2 సీజన్ కంటెస్టెంట్ సంజన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని ఆమె ఆరోపించారు. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఆశిష్ గౌడ్‌తో రాజీ కుదుర్చుకుని కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా కొంతమంది సినీ,రాజకీయ ప్రముఖులు తనపై ఒత్తిడి తెస్తున్నారని నటి సంజన తాజాగా ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరితే.. కనీసం ఫుటేజీని కూడా పరిశీలించలేదన్నారు. ఆశిష్ గౌడ్‌తో రాజీ చేసుకోవాలని కొంతమంది తెగ ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. అతనిపై చట్టబద్దంగా పోరాటం చేస్తానని తెలిపారు. ఆరోజు రాత్రి పబ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా... మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>