• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • I WANT TO EXPERIENCE FEELING OF DEATH MAN RECORDS SUICIDE ON TIKTOK WHILE DRINKING POISON NK

చావు ఎలా ఉంటుంది?... తెలుసుకోవాలనుకున్న టిక్ టాక్ స్టార్... చివరకు మృతి...

చావు ఎలా ఉంటుంది?... తెలుసుకోవాలనుకున్న టిక్ టాక్ స్టార్... చివరకు మృతి...

చావు ఎలా ఉంటుంది?... తెలుసుకోవాలనుకున్న టిక్ టాక్ స్టార్... చివరకు మృతి...

అతను రెగ్యులర్‌గా టిక్ టాక్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. యూజర్ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాడు. మరి ఈ చావుపై ఆసక్తి ఎందుకు కలిగింది? ఏం చేశాడు?

 • Share this:
  ఇదో షాకింగ్ కేసు. అనూహ్య పరిణామం. ఎవరూ ఊహించనిది. ఎవరూ కోరుకోనిది. బాధ్యతా రాహిత్యమైన వ్యవహారశైలితో... ఆ 24 ఏళ్ల యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. పేరు ధనంజయ్. కర్ణాటకలోని తుమకూరు జిల్లా... కొరాటగెరెకు చెందినవాడు. శనివారం సాయంత్రం... ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లైనా ఉద్యోగం, సద్యోగం లేకుండా ఆ టిక్ టాక్ వీడియోలేంట్రా అని తల్లి తిట్టింది. "ఇలా గాలిగా తిరిగే బదులు... ఎందులోనైనా దూకి చావు" అని ఆవేశంలో నాలుగు మాటలంది. అప్పుడే ధనుంజయ్ తనకు ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చినట్లు ఫీల్ అయ్యాడు. దాన్ని అమలు చెయ్యాలని అనుకున్నాడు.

  చావు ఎలా ఉంటుంది? చచ్చిపోయేటప్పుడు ఎలాంటి ఫీల్ కలుగుతుంది? ఎలాంటి నొప్పి వస్తుంది? ఇలా ఆలోచించాడు. ఐడియా... టిక్ టాక్ వీడియో చేస్తా అనుకున్నాడు. రెండ్రోజుల తర్వాత... ఓ పురుగుల మందు డబ్బా కొనుక్కున్నాడు. ఎందుకూ అని షాప్‌లో వ్యక్తి అడిగితే... మిడతలు... పొలాన్ని తినేస్తున్నాయ్ అన్నాడు. ఈమధ్య మిడతల మేటర్ బాగా నడుస్తోంది కదా... అందుకే షాపతను నమ్మేశాడు.

  పురుగుల మందుతో ఓ ఖాళీ ప్రదేశానికి వెళ్లిన ధనంజయ్ టిక్ టాక్ వీడియో స్టార్ట్ చేసి... "నేను చావు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నాకు నేను చావడానికి ట్రై చేస్తున్నాను" అంటూ పురుగుల మందు తాగాడు. ఆ వీడియోని అప్‌లోడ్ చేయకముందే... అతనికి కడుపులో నొప్పి మొదలైంది. ఇంటికి వెళ్లి... తన ఫ్రెండుకి కాల్ చేసి మేటర్ చెప్పాడు. "ఓరేయ్... అంత పని చేశావా... భలే వోడివిరా నువ్వు... ఎందుకు తాగావురా... పురుగుల మందు మంచిది కాదురా... అది మనుషుల్ని చంపేస్తదిరా" అంటూ పరుగెత్తుకుంటూ... వచ్చి... ధనుంజయ్‌ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులూ వెంట వేళ్లారు. రాత్రంతా మృత్యువుతో పోరాడి తెల్లారే చనిపోయాడు. పోలీసులు ఇదో అసాధారణ మరణంగా కేసు రాశారు.

  ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అమ్మ తిట్టిన రోజునే చచ్చేందుకు ఓ ప్రయోగం చేసి ఫెయిలయ్యాడు. ఏం చేశాడంటే... బైక్ డ్రైవ్ చేస్తూ... వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టాడు. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కనీసం అప్పుడైనా ఈ పని మానాడా అంటే మానలేదు.

  బైక్ గాయాల తర్వాత ధనంజయ్ కుటుంబం, చుట్టుపక్కల వాళ్లూ ఇలాంటి పనులు చెయ్యకు. స్టంట్స్ చేయడం మనకు కుదరదు. అందుకు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకోవాలి. అని చెప్పారు. (వాళ్లకు స్టంట్ చేశానని మాత్రమే చెప్పాడు)

  ఈ కథలో మరో కోణం కూడా ఉంది. నాలుగు నెలల కిందట... ధనుంజయ్‌కి పెళ్లైంది. కుటుంబ పోషణ కోసం ఓ ఆటోను అద్దెకు తీసుకున్నాడు. తీరా లాక్‌డౌన్ అమలయ్యాక... చేతిలో డబ్బు లేకుండా పోయింది. మైండ్‌లో రకరకాల ఆలోచనలు ఎక్కువయ్యాయి. టిక్ టాక్ వీడియోలు చేస్తూ... ఉపశమనంలా ఫీల్ అయ్యాడు. తన తల్లి తనను తిడుతోంది కాబట్టి... సూసైడ్ ప్రయత్నం ద్వారా... ఆమెను బెదిరించి... ఇక తనను తిట్టనివ్వకుండా చెయ్యాలని అనుకున్నాడు. అదే సమయంలో... టిక్ టాక్ వీడియో కూడా తయారుచేసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో డెత్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చూసినట్లు అవుతుందని అనుకున్నాడు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు