హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

అసెంబ్లీలో బూతు వీడియో చూసిన BJP ఎమ్మెల్యే.. రచ్చ రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

అసెంబ్లీలో బూతు వీడియో చూసిన BJP ఎమ్మెల్యే.. రచ్చ రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

పోర్న్ వీడియో చూస్తున్న ఎమ్మెల్యే (image credit - twitter - ANI)

పోర్న్ వీడియో చూస్తున్న ఎమ్మెల్యే (image credit - twitter - ANI)

తప్పు చెయ్యడమే కాకుండా.. దాన్ని సమర్థించుకునేలా కామెంట్స్ ఇవ్వడం ఇంకా పెద్ద తప్పు. అలాంటి ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎందుకు భరించాలి? వాళ్లు ఎందుకు రాజీనామా చెయ్యరు? ఇదే ఇప్పుడు తేలాల్సిన అంశం అయ్యింది. అసలా ఎమ్మెల్యే ఎవరో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

త్రిపుర అసెంబ్లీలో.. బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ (Jadav Lal Nath) అడ్డంగా దొరికాడు. ఓవైపు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుంటే.. ఈ ఎమ్మెల్యే తన మొబైల్‌లో పోర్న్ వీడియో చూసుకుంటూ కూర్చున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రతిపక్షాలతోపాటూ ప్రజలు కూడా ఆ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. సదరు ఎమ్మెల్యే... బాగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వెలగబెడుతున్నాడు.

అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వెనక ఉన్న ఎవరో.. ఎమ్మెల్యే బూతు వీడియో చూస్తుండటాన్ని తమ మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని గమనిస్తే... ఎమ్మెల్యే కావాలనే, ఉద్దేశపూర్వకంగానే వీడియో చూసినట్లుగా కనిపిస్తోందనే విమర్శలు భగ్గుమంటున్నాయి. సభలో వాడివేడిగా చర్చ జరుగుతుంటే.. ఈ ఎమ్మెల్యే తాపీగా పోర్న్ వీడియో చూడటమేంటని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు.. స్పీకర్ సీటులో కూర్చున్న వారు సుమోటోగా చర్యలు తీసుకోవాలి. కానీ త్రిపురలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా. దాంతో స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. "సోషల్ మీడియాలో రకరకాల విషయాలు వైరల్ అవుతున్నాయి. వాస్తవాలను కనుగొనకుండా, నేను దానిపై చర్య తీసుకోలేను. నాకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదు" అని స్పీకర్ బిశ్వబందు సేన్ అన్నారు. దీన్ని బట్టే ఆయన ఎమ్మెల్యేని వెనకేసుకొస్తున్నారని అర్థం చేసుకోవచ్చు అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

బీజేపీ అధినాయకత్వం దీనిపై ఎమ్మెల్యేకి సమన్లు పంపింది. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సదరు ఎమ్మెల్యే స్పందించాడు. "నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత సడెన్‌గా ఓ వీడియో ప్లే అయ్యింది" అని తెలిపారు. ఇది నమ్మశక్యంగా లేదని అంటున్నాయి విపక్షాలు. కాల్ వస్తే.. వీడియో ప్లే అవుతుందా అని ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేసింది చాలక.. దాన్ని సమర్థించుకోవడమేంటని నిలదీస్తున్నాయి. అసెంబ్లీ సమావేశం తర్వాత ఆ ఎమ్మెల్యే తాపీగా బయటకు వెళ్లాడు.

బహిరంగ ప్రదేశంలో పోర్న్ చూస్తూ ఓ బీజేపీ నేత పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. 2012లో కర్ణాటకలోని నాటి BJP ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో తమ ఫోన్‌లలో పోర్న్ క్లిప్‌లను చూడటం బయటపడటంతో ఇద్దరూ రాజీనామా చేయవలసి వచ్చింది. మంత్రులు, లక్ష్మణ్ సవాది, సిసి పాటిల్.. ఏ తప్పూ చేయలేదని విచారణ తర్వాత పార్టీ తిరిగి వారిని చేర్చుకుంది.

First published:

ఉత్తమ కథలు