హోమ్ /వార్తలు /క్రైమ్ /

హైదరాబాద్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే చోరీలు చేసే దొంగ

హైదరాబాద్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే చోరీలు చేసే దొంగ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కాజాం చోరీలను సొంతంగానే చేస్తాడు. ఎవరి సాయం తీసుకోడు. ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరతాడు. ఇంటి తాళాలను పగలగొట్టే పరికరాలు అండర్ వేర్‌లో దాచి పెట్టుకుంటాడు. ఎలక్ట్రికల్ టెస్టర్ మాత్రం పైన జేబులో అందరికీ కనిపించేలా పెడతాడు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అంటే కేవలం గవర్నమెంట్ జాబ్ టైమింగ్స్. కేవలం ఆ టైమ్‌లో మాత్రమే అతడు దొంగతనాలు చేస్తాడు. పొద్దున్నే స్నానం చేసి 9 గంటలకు జేబులో టెస్టర్ పెట్టుకుని ఏదోపెద్ద పనున్న వాడిలా బయటకు వస్తాడు. ఆ తర్వాత అటూ ఇటూ తిరిగి సాయంత్రం 5 గంటల సమయానికి ఓ దొంగతనం చేసేస్తాడు. ఆ తర్వాత ఎంచక్కా ఇస్త్రీ బట్టలు నలగకుండా ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో సాయంత్రం స్నానం చేసి చక్కగా టీవీ పెట్టుకుని కూర్చుంటాడు. అలా ఒకటి కాదు. రెండు కాదు. చాలా రోజులుగా సాగుతోంది ఈ వ్యవహారం. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. టోలిచౌకి పారామౌంట్ కాలనీకి చెందిన కాజాం అలీ ఖాన్ అలియాస్ కాజూ అలియాస్ సూర్య (28) పదో తరగతి చదివాడు. స్థానిక ఫంక్షన్ హాల్లో తండ్రితో కలసి పనిచేసేవాడు. చెడు అలవాట్లకు బానిసై 16 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలు పెట్టాడు.చోరీ సొత్తుతో ముంబై, బెంగళూరు, గోవాల్లో విలాసాలు చేసేవాడు. లాక్ డౌన్ కంటే ముందు 70 చోరీలు చేశాడు. 2015లో జూబ్లిహిల్స్, 2016లో సంగారెడ్డి పోలీసులు ఇతడి మీద పీడీ యాక్ట్ ప్రయోగించారు. గత ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదలైన కాజాం మళ్లీ ఆగస్టు నుంచి చోరీలు మొదలు పెట్టాడు. 4 నెలల్లో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్‌లో 16 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు.

Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు

ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

కాజాం చోరీలను సొంతంగానే చేస్తాడు. ఎవరి సాయం తీసుకోడు. ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరతాడు. ఇంటి తాళాలను పగలగొట్టే పరికరాలు అండర్ వేర్‌లో దాచి పెట్టుకుంటాడు. ఎలక్ట్రికల్ టెస్టర్ మాత్రం పైన జేబులో అందరికీ కనిపించేలా పెడతాడు. ఖరీదైన ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను టార్గెట్ చేస్తాడు. అక్కడ వాచ్ మెన్ వద్దకు వెళ్లి తాను ఎలక్ట్రీషియన్ అని పరిచయం చేసుకుంటాడు. కరెంటు పనులు ఉంటే చెప్పాలంటాడు. అపార్ట్ మెంట్ లిఫ్ట్‌ల్లో రెండు మూడుసార్లు తిరుగుతూ ఏ ఫ్లాట్‌కు తాళం వేసి ఉందో చెక్ చేస్తాడు. ఆ తర్వాత లిఫ్ట్ కు దగ్గరగా ఉండే ఫ్లాట్‌ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడతాడు.

Live Video: చిరుత దాడి.. భయంకరంగా చంపేసింది.. పీక్కుని, లాక్కెళ్లింది

విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

తన ముఖం ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ పెట్టుకుంటాడు. తాజాగా, కరోనా పేరుతో ముఖానికి హెల్మెట్ కూడా పెట్టుకోవడం మొదలు పెట్టాడు. దీంతో అతడి పర్సనాలిటీ సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తున్నా, ముఖం మాత్రం కనిపించదు. దీంతో పాటు అతడు ఒక్కో చోరీకి ఒక్కో వాహనం మీద వెళ్తాడు. కాజాం నుంచి రూ.52 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 4 బైక్‌లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

First published:

Tags: Hyderabad, Telangana Police