మావోయిస్టులతో సంబంధాలు..ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాదీ అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌,మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు వెంకటరావు పనిచేసినట్లు తెలిసింది. విచారణలో మరిన్ని విషయాలు బయటకొస్తాయని ఛత్తీస్‌గఢ్ ఐజి ఎస్పీ సింగ్ తెలిపారు.

news18-telugu
Updated: December 24, 2018, 3:18 PM IST
మావోయిస్టులతో సంబంధాలు..ఛత్తీస్‌గఢ్‌తో హైదరాబాదీ అరెస్ట్
నక్కా వెంకటేశ్వరావు
  • Share this:
అర్బన్ మావోయిస్టుల డొంక కదులుతోంది. నక్సలైట్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణవాసి అరెస్టయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన నక్కా వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా అతన్ని పట్టుకున్నట్లు సమాచారం. దేశంలో అర్బన్ నక్సలిజంపై చర్చ జరుగుతున్న వేళ..హైదరాబాదీ అరెస్ట్ సంచలనం సృష్టిస్తోంది.

హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో నక్కా వెంకట్‌రావు ఉద్యోగం చేస్తున్నాడు. 2016, 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టుల నెట్‌వర్క్‌ని పటిష్టం చేయడంతో పాటు అర్బన్ నక్సలిజం వ్యాప్తిలో వెంకట్‌రావు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌,మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు వెంకటరావు పనిచేసినట్లు తెలిసింది. ఇక అతడి సోదరుడు పౌరహక్కుల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో మరిన్ని విషయాలు బయటకొస్తాయని ఛత్తీస్‌గఢ్ ఐజి ఎస్పీ సింగ్ తెలిపారు.

మావోయిస్టులంటే అడవుల్లోనే ఉంటారన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు నగరాల్లో అందరి మధ్యే ఉంటూ తమ పని తాము కానిస్తున్నారు. దేశంలో అర్బన్ నక్సలిజం చాప కింద నీరులా విస్తరిస్తోందని ఇటీవల ప్రధానంగా వినిపిస్తున్న మాట. బీమా-కోరెగావ్ కేసు విచారణ తర్వాత వరవరరావు సహా దేశవ్యాప్తంగా పలువురిని పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అర్బన్ మావోయిజంపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో నక్కా వెంకటరావును ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: December 24, 2018, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading