దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చాలావరకు చుట్టుపక్కల తెలిసినవారు, బంధువులే ఇలాంటి వేధింపులకు, లైంగిక దాడులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ నటి తనపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిలింనగర్‌కు చెందిన నేహా శర్మ యూట్యూబ్ వీడియోలలో నటిస్తోంది. ఈ నెల 13న ఆమె కేరళలోని పద్మనాభస్వామిని దర్శించుకునేందుకు అక్కడికి వెళ్లింది. యువతితో పాటు ఆమె డ్రైవర్ షేక్ ఇబ్రహీం కూడా ఉన్నాడు. అయితే అక్కడ అతను ఆ నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించి ఆ నటి శనివారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ ఇబ్రహీం కేరళ వెళ్లినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి మాదక ద్రవ్యాల(డ్రగ్స్) అలవాటు ఉందని.. సమయానికి తీసుకోవాల్సిన డ్రగ్స్ తీసుకోకపోవడంతో ఇలా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే డబ్బు కోసం కూడా తనని వేధిస్తున్నట్లుగా తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Harassment, Hyderabad, Youtube star