ఫ్లై ఓవర్ అంచున కూర్చుని జనాలకు ‘పిచ్చెక్కించిన’ యువకుడు..

ఫ్లై ఓవర్ అంచున కూర్చున్న యువకుడు ఎప్పుడు దూకేస్తాడో అని అక్కడున్న వారు టెన్షన్ టెన్షన్‌గా గడిపారు.

news18-telugu
Updated: July 18, 2019, 5:12 PM IST
ఫ్లై ఓవర్ అంచున కూర్చుని జనాలకు ‘పిచ్చెక్కించిన’ యువకుడు..
ఫ్లై ఓవర్ అంచున కూర్చున్న యువకుడు
  • Share this:
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే. వచ్చే, పోయే కార్లు వేగంగా వెళ్తున్నాయి. అయితే, అందరి దృష్టి ఆకర్షించాడో యువకుడు. అందరూ చూస్తుండగానే బ్రిడ్జి మధ్యలో నుంచి అంచుకి వచ్చాడు. ఫ్లై ఓవర్ గోడ ఎక్కాడు. అక్కడ కూర్చున్నాడు. అతడు దూకేస్తాడేమోనని అందరిలోనూ భయం. కారులో వెళ్లేవారు ఎవరూ ఆపి.. అతడిని పట్టుకునేంత సాహసం చేయడం లేదు. ఏ క్షణాన దూకేస్తాడో అని.. అతడిని చూస్తున్న వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. అయితే, అంతలో ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చారు. ఆ యువకుడిని రక్షించారు. తమ బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆ యువకులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఏదైనా సాహసం చేసి మెప్పిస్తే నరేంద్రమోదీ స్కార్పియో కారు ఇస్తారని నమ్మి.. అతడు ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, అవన్నీ ఫేక్ న్యూస్ అని రాజేంద్రనగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి.సురేష్ స్పష్టం చేశారు.

ఇటీవల ఫేక్ న్యూస్ ప్రచారం బాగా పెరిగిపోయింది. కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ప్రజలను ముంచుతున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇస్తారంటూ ప్రజల ఆధార్ కార్డు నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకుని, వారి ఖాతాల్లో నుంచి డబ్బులను మాయం చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ముఠాలు పెరిగిపోయాయి.First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...