హైదరాబాద్‌లో.. అమ్మాయి కోసం అమ్మకు టోకరా...

సొంత ఇంట్లోనే రూ.50వేల నగదు, 8 తులాల బంగారం చోరీ చేశాడు.అమ్మాయి కోసం అమ్మను మోసం చేశాడని తెలుసుకుని కన్న కొడుకు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: November 21, 2019, 7:47 PM IST
హైదరాబాద్‌లో.. అమ్మాయి కోసం అమ్మకు టోకరా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తనకు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా కన్నతల్లికే టోకరా వేశాడో కొడుకు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లోని ఓ యువకుడు ఓ అమ్మాయితో స్నేహంగా మెలుగుతున్నాడు. ఆమెతో సరదాగా తిరగడానికి, ఇతర జల్సాల కోసం డబ్బుల అవసరం వచ్చింది. అయితే, ఆ డబ్బుల కోసం అడ్డదారి తొక్కాడు. ఏకంగా సొంతింటికే కన్నం వేయాలని పథకం పన్నాడు. సొంత ఇంట్లోనే రూ.50వేల నగదు, 8 తులాల బంగారం చోరీ చేశాడు. ఇంట్లో డబ్బు, నగలు పోయిన విషయం తెలుసుకున్న తల్లికి కొడుకు మీద అనుమానం వచ్చింది. అమ్మాయి కోసం అమ్మను మోసం చేశాడని తెలుసుకుని కన్న కొడుకు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడి మీద ఐసీసీ సెక్షన్లు 420, 380 కింద కేసులు నమోదు చేశారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>