news18-telugu
Updated: November 27, 2020, 5:53 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఆన్లైన్ గేమ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవంతంగా శుక్రవారం తనువు చలించాడు. కొద్ది రోజుల క్రితమే జగదీశ్ చేసిన రూ.16 లక్షల అప్పును తండ్రి తీర్చాడు. అయినా అప్పులు మొత్తం తీరకపోవడంతో మళ్లీ ఆన్లైన్ గేమ్ ఆడాడు. దీంతో జగదీశ్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకొని సూసైడ్‌కు పాల్పడ్డాడు. ఈ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఆన్ లైన్ గేమ్స్ ఆడడం వల్ల తాను ఆర్థికంగా నష్టపోయానని చెప్పాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాలలో ఇలాంటి ఘటనగతంలో మంచిర్యాలలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆన్ లైన్ గేమ్ ఆడేందుకు చేసిన రూ.15 లక్షల అప్పును తల్లిదండ్రులు తీర్చడంతో మనస్తాపం చెంది బిటెక్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. వీరిలో కుమారుడు మధుకర్ బీటెక్ చదువుతున్నాడు. అదే సమయంలో ఇతను ఆన్ లైన్ డఫ్పాగేమ్ కు అలవాటు పడ్డాడు. స్నేహితుల వద్ద అప్పులు చేసి మరీ ఆడటంతో పదిహేను లక్షల రూపాయల వరకు అప్పులయ్యాయి. తల్లిదండ్రులకు ఒక కుమారుడు కావడంతో మందలించి ఆ అప్పులు కట్టారు. దీంతో మధుకర్ తన తల్లిదండ్రులను అప్పులపాలు చేశానని మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని కరీంనగర్ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 27, 2020, 5:45 PM IST