ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన యవకుడు ఆ తర్వాత ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. వనస్థలిపురం నాగార్జున కాలనీకి చెందిన యువకుడు సాయికుమార్(19) హస్తినాపురంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే పదో తరగతి చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికను వెంటపడిన సాయికుమార్.. ప్రేమించానని నమ్మించాడు. ఆమె వెంట తిరుగుతూ తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే సాయికుమార్ తనను ప్రేమిస్తున్నట్టు ఆ బాలిక నమ్మింది. దీంతో సాయికుమార్ తన ప్లాన్‌ను అమలు చేశాడు.
ప్రేమ పేరుతో ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని ఫొటోలను కూడా తీశాడు. తర్వాత కొద్ది రోజులకు ఆ ఫొటోలతో ఆమెను బెదిరింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. తనకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక.. అతని డబ్బులు ఇచ్చింది. ఇలా పలు దఫాలుగా రూ. 65 వేలు సాయికుమార్‌కు ముట్టజెప్పింది.
అయినప్పటికీ సాయికుమార్ వేధింపులు ఆపకపోవడంతో.. బాలిక ఈ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇందుకు సంబంధించి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.