సమాజం తల దించుకోవాల్సిన ఘటన ఇది.. మానవత్వానికి మాయని మచ్చ ఇది.. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు.. ఆఖరుకు మూగ జీవాలను కూడా వదలడం లేదు. శునకాలు, మేకలు, ఆవులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా.. తొమ్మిది నెలల లేగదూడపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హైదర్‌గూడ అవంతినగర్‌లో నివాసముండే ఓ వ్యక్తికి పశువుల కొట్టం ఉంది. అందులో మహేశ్(30) పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే.. బుధవారం రాత్రి ఎవరూ లేని సమయం చూసి లేగ దూడతో తన కామవాంఛ తీర్చుకున్నాడు.
కొట్టం పక్కనే ఉన్న ఇంటి యజమాని ఈ ఘటనను చూశాడు. వెంటనే నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్, ఎస్సై నారాయణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.